📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Trump 2025: ప్రపంచ దేశాలను వణికించిన ట్రంప్’ నిర్ణయాలు

Author Icon By Rajitha
Updated: December 30, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2025 సంవత్సరం ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో “అమెరికా ఫస్ట్” విధానాన్ని మరింత దూకుడుగా అమలు చేస్తూ గ్లోబల్ మార్కెట్లను షేక్ చేశారు. టారిఫ్ యుద్ధాలతో మొదలైన ఈ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యం, కరెన్సీలు, పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఒకే ఏడాదిలో ప్రపంచ ఆర్థిక పటాన్ని తిరగరాసిన అరుదైన ఉదాహరణగా 2025 నిలిచింది.

Read also: Donald Trump: పుతిన్ నివాసంపై దాడి మండిపడ్డ ట్రంప్

Trump 2025

రష్యా–ఉక్రెయిన్ అంశాల్లో ట్రంప్ తీసుకున్న వైఖరి

2025 ఏప్రిల్ 2న ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో ‘లిబరేషన్ డే’ టారిఫ్ షాక్ ప్రారంభమైంది. దాదాపు అన్ని దేశాల దిగుమతులపై కనీసం 10 శాతం బేస్ టారిఫ్ విధించడంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొన్ని గంటల్లోనే సుమారు 10 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైపోయింది. చైనా నుండి వచ్చే వస్తువులపై టారిఫ్‌ను 145 శాతం వరకు పెంచడంతో వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇదే ఏడాది ఆగస్టులో భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించడం మరో పెద్ద షాక్‌గా మారింది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఫార్మా మరియు సెమీకండక్టర్ రంగాలకు మినహాయింపులు ఇవ్వడం భారత్‌కు కొంత ఊరటనిచ్చింది.

ట్రంప్ టారిఫ్ విధానాల వల్ల చైనా నుంచి అనేక కంపెనీలు తమ తయారీ కేంద్రాలను తరలించడంతో ‘మేక్ ఇన్ ఇండియా’కి ఊపొచ్చింది. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందుకెళ్లగా, ఇండియాలో తయారైన ఐఫోన్లు సహా పలు ఉత్పత్తులు రికార్డు స్థాయిలో ఎగుమతి అయ్యాయి. మరోవైపు ట్రంప్ ఆర్థిక విధానాలతో డాలర్ బలపడటంతో రూపాయి ఒక దశలో 88.78కి పడిపోయినా, ఐటీ ఎగుమతులు మరియు ఇన్వెస్టర్ల నమ్మకంతో మళ్లీ స్థిరపడింది. నాటో, యూరోప్ భద్రత, రష్యా–ఉక్రెయిన్ అంశాల్లో ట్రంప్ తీసుకున్న వైఖరి భూరాజకీయ సమీకరణాలను కూడా మార్చింది. మొత్తం మీద గందరగోళం మధ్యలోనూ భారత్ 8.2 శాతం జీడీపీ వృద్ధిని సాధించి తన ఆర్థిక సామర్థ్యాన్ని చాటింది. 2025 ట్రంప్ ఎకానమీ నేర్పిన పాఠం ఒక్కటే.. ప్రపంచ మార్కెట్లు క్షణాల్లో మారిపోతాయి, కాబట్టి స్వయం సమృద్ధే భవిష్యత్ దారి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Global Economy latest news Telugu News Trade War Trump 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.