📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Trump tariff : ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతులపై 15% సుంకం ప్రకటింపు

Author Icon By Sai Kiran
Updated: February 22, 2026 • 1:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Trump tariff : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ముందుగా 10 శాతం సుంకాలు విధిస్తానని ప్రకటించిన ట్రంప్, తాజాగా మరింత పెంపును ప్రకటించడం గ్లోబల్ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇటీవల అధ్యక్షుడికి స్వతంత్రంగా సుంకాలు విధించే అధికారం లేదని, ఆ అధికారం కాంగ్రెస్‌కే ఉందని అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దేశ ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయమని విమర్శించారు. కోర్టు అడ్డంకులు ఉన్నప్పటికీ, ఇతర చట్టపరమైన మార్గాల ద్వారా సుంకాలను అమలు చేయాలని చూస్తున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.

తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై ట్రంప్ విమర్శలు చేయగా, తనకు మద్దతుగా నిలిచిన జడ్జి బ్రెట్ కావనాకు ప్రశంసలు కురిపించారు. దిగుమతి సుంకాల పెంపుతో దేశీయ తయారీ రంగం బలోపేతం అవుతుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also:Ramchandar Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హౌస్ అరెస్ట్?

Trump tariff

అయితే ఈ నిర్ణయంపై డెమోక్రాట్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అధిక సుంకాలు విధించడం వల్ల వస్తువుల ధరలు పెరిగి సాధారణ ప్రజలపై భారం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దిగుమతి సుంకాల ద్వారా భారీ ఆదాయం సమకూరగా, తాజా పెంపు ఎంతకాలం కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచ దేశాలన్నింటికీ 15 శాతం సుంకం వర్తించే అవకాశంతో భారత్ సహా అనేక దేశాలపై ప్రభావం పడనుంది. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

global trade tensions usa Google News in Telugu india export impact us tariffs inflation import duties impact international trade policy news protectionist trade policy usa tariff impact on global markets Telugu News trump economic strategy tariffs trump tariff increase 15 percent us import tariffs policy us supreme court tariff ruling

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.