📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: California: కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం చేసిన ట్రక్​ డ్రైవర్​ అరెస్ట్

Author Icon By Vanipushpa
Updated: October 24, 2025 • 1:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుడు కారణంగా కాలిఫోర్నియా(California)లో రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రగ్స్ మత్తులో ట్రక్​ను నడపడం వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇండియన్ ట్రక్​ డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ప్రమాదం దక్షిణ కాలిఫోర్నియాలోని సాన్​ బర్నిర్డినో కౌంటీ ఫ్రీవే వద్ద జరిగింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 21 ఏళ్ల భారతీయుడు జషన్‌ ప్రీత్‌ సింగ్ డ్రగ్స్ తీసుకుని మితిమీరిన వేగంతో ట్రక్​ను నడిపాడు.

Read Also: Caroline Leavitt: H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు: కరోలీనా లివిట్

California

ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి

హై స్పీడ్​లో వచ్చిన జషన్ ​ప్రీత్ బ్రేక్​ వేయకుండా ట్రాఫిక్​లో నెమ్మదిగా కదులుతున్న ముందున్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జషన్​ప్రీత్​ సింగ్ కూడా గాయపడ్డారు. అలాగే, ఒక మెకానిక్‌ కూడా గాయపడిన వారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన జషన్ ​ప్రీత్​ సింగ్​పై డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్, హత్య వంటి అభియోగాలపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నివేదికల్లో డ్రగ్స్​ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

సీసీ కెమెరాలో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలు

బ్రేకులు వేయకుండానే ట్రాఫిక్‌ జామ్‌లోకి దూసుకెళ్లాడని పేర్కొన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు జషన్​ప్రీత్​ సింగ్​ నడిపిన ట్రక్​లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే మరణించిన వారి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. జషన్​ ప్రీత్​ సింగ్​కు అమెరికాలో చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదా లేదని యూఎస్​ హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ ధృవీకరించింది. జషన్​ ప్రీత్​ సింగ్ అరెస్ట్ తర్వాత యునైటెడ్‌ స్టేట్స్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (USICE) అతడిపై ఇమ్మిగ్రేషన్​ డిటెన్షన్​ను విధించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

California accident highway crash Latest News Breaking News police investigation road safety Telugu News Traffic incident Truck driver arrest US News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.