పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Attack) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిపై అమెరికా (America) కీలక నిర్ణయం తీసుకుంది.పాకిస్థాన్‌కు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) పై అమెరికా కఠిన చర్యలు తీసుకుంది. TRFను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ గ్రూప్ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తోంది.గురువారం అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటన చేసింది. కార్యదర్శి మార్కో రూబియో దీన్ని వెల్లడించారు. TRFను FTOగా గుర్తిస్తున్నామని చెప్పారు.
పహల్గామ్ దాడిపై బహిరంగంగా మాట్లాడిన అమెరికా
TRF ఆ దాడికి బాధ్యత స్వీకరించినట్టు మొదట ప్రకటించింది. అయితే, కొన్ని రోజుల్లోనే తమ ప్రకటనను వెనక్కి తీసుకుంది. దాడిలో తమకు సంబంధం లేదని చెప్పింది.TRFను “కశ్మీర్ రెసిస్టెన్స్” అని కూడా పిలుస్తారు. ఇది సోషల్ మీడియాలో ప్రాపగండాతో ఆకర్షిస్తుంది. యువతను మోసగిస్తూ ఉగ్రవాదానికి జోక్యం చేస్తుంది.
ముంబై దాడుల్లోనూ లష్కరే తోయిబా ప్రమేయం
2008 ముంబై దాడుల్లో ఈ సంస్థ ప్రధాన పాత్ర పోషించింది. మూడు రోజుల పాటు ముంబై అంతా భయాందోళనలో మునిగిపోయింది. అప్పటి నుంచి లష్కరే తోయిబాపై పలు ఆరోపణలు ఉన్నాయి.
చట్టపరంగా హోదా మార్పు
ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం ఈ హోదా మార్పు జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం TRFను SDGTగా కూడా చేర్చారు.ఈ మార్పులన్నీ ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన వెంటనే అమలులోకి వస్తాయి. ఇది అమెరికా తీసుకున్న కఠిన భద్రతా చర్యలలో భాగం.
Read Also : AAIB : ఎయిరిండియా ప్రమాదం.. నిరాధార వార్తలపై స్పందించిన ఏఏఐబీ