ఇరాన్ చివరి రాజు మొహమ్మద్ రెజా పహ్లవీ చిన్న కూతురు లీలా పహ్లావి (Princess Pahlavi). ఈమె తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు ఇరాన్ వదిలి వెళ్లిపోయింది. 31 ఏళ్లకు లండన్‌లోని ఓ హోటల్‌లో శవమై తేలింది. 1970 ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో లీలా పహ్లవి జన్మించారు. రాజు రెజా పహ్లవి, రాణి ఫరా పహ్లవి నాలుగో కూతురే లీలా. ఈమె బాల్యమంతా పహ్లావి రాజకోటలోని కట్టుదిట్టమైన భద్రత మధ్య గడిచింది. ఆమె విద్యాభ్యాసం అంతా ప్రైవేట్ ట్యూటర్ల ద్వారా, రాజరిక మర్యాదలు, పర్షియన్ సంస్కృతి, చరిత్రపై ప్రత్యేక దృష్టితో సాగింది. షా పాలనలో ఇరాన్ వేగంగా ఆధునికీకరణ చెందింది. దీంతో లీలా ఓవైపు పర్షియన్ సంప్రదాయాలను, మరోవైపు పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని బ్యాలెన్స్ చేస్తూ పెరిగారు.
Read Also: Bangladesh crime: హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన
ఆ కుటుంబానికి పౌరసత్వం, భద్రత, ఇళ్లు లేకుండా చేశాయి
రాజభవన వైభవం ఉన్నప్పటికీ లీలా సున్నితమైన బాలిక. తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఆమెకు గాఢమైన అనుబంధం ఉంది. కానీ ఈ సురక్షితమైన, విలాసవంతమైన ప్రపంచం ఆమె జీవితంలో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. 1979 జనవరిలో రాజ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీంతో పహ్లవి రాజ కుటుంబం ఇరాన్ వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో లీలాకు 9 ఏళ్ల వయసు. ఇరాన్‌లో చెలరేగిన ఈ నిరసనలు కేవలం పహ్లవి పాలనను అంతం చేయడమే కాదు.. ఆ కుటుంబానికి పౌరసత్వం, భద్రత, ఇళ్లు లేకుండా చేశాయి. ఈ సమయంలో ఆ కుటుంబం తాత్కాలికంగా ఈజిప్ట్,మోరాకో, బహమాస్, మెక్సికో, అమెరికా, పనామా లాంటి దేశాల్లో నివసించాల్సి వచ్చింది. ఇదే సమయంలో మొహమ్మద్ రెజా కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరికి 1980 జులై 27న ఆయన మరణించారు. ఆయన మరణంతో ఇక పహ్లవి కుటుంబం ఛాప్టర్ అక్కడితో ముగిసిపోయింది. మళ్లీ ఆ కుటుంబం ఇరాన్‌కు వచ్చే ఆశ కూడా లేకుండా పోయింది.
లీలాకు తీవ్రమైన అనారోగ్య సవాళ్లు
మొహమ్మద్ రెజా మరణం తర్వాత రాకుమారి ఫరా పహ్లవి కుటుంబ సభ్యులు అమెరికా స్థిరపడిపోయారు. లీలా న్యూయార్క్‌లోని యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత 1988లో రై కంట్రీ డే స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం లీలా అమెరికాతో పాటు ప్యారిస్‌లో కూడా ఉండేది. దీంతో ఆమె పర్షియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్‌తో పాటు ఇతర భాషలు కూడా అవలీలగా మాట్లాడేది. కానీ లీలా యువరాణిగా ఉండే సౌకర్యాన్ని మాత్రం చిన్న వయసులోనే కోల్పోయింది. లీలా యుక్త వయస్సుకు వచ్చాక ఆమెకు తీవ్రమైన అనారోగ్య సవాళ్లు ఎదురయ్యాయి. దీర్ఘకాలిక అలసట, డిప్రెషన్, తీవ్రమైన అనోరెక్సియా సమస్యలతో బాధపడేది. చివరికి లీలా 31 ఏళ్ల వయసులో 2001 జూన్ 10న లండన్‌లోని లియోనార్డ్ హోటల్‌లో మృతి చెందింది. అధిత మోతాదులో మాత్రలు తీసుకోవడం వల్లే ఆమె మృతి చెందినట్లు విచారణలో తేలింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: