అమెరికా(America) – చైనా మధ్య వాణిజ్య యుద్ధం(trade war) మరింత ముదురుతోంది. తాజాగా, ఇరుదేశాలు నౌకలపై పరస్పరం ప్రత్యేక ఫీజులను ప్రకటించాయి. అమెరికా యాజమాన్యంలోని నౌకలు, అమెరికా నిర్వహించే లేదా ఆ దేశపు జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీని వసూలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. అయితే, చైనాలో నిర్మించిన నౌకలకు మాత్రం ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇదివరకే అమెరికా కూడా చైనా నౌకలపై ప్రత్యేక ఫీజును వసూలు చేస్తోంది.
Read Also: FCSS: ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ సరికొత్త అడుగు
చైనా స్పందన: ‘యుద్ధం కోరుకుంటే చివరి వరకు పోరాడతాం’
అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. వాణిజ్య యుద్ధం, టారిఫ్‌ల(Tariffs) అంశంపై తమ వైఖరి స్థిరంగా ఉందని, అమెరికా ఈ తరహా యుద్ధం కోరుకుంటే తాము చివరి వరకు పోరాడుతామని పేర్కొంది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఒకవేళ చర్చలు జరపడానికి సిద్ధమైతే, అందుకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపారు.
చైనా ఏ రకం నౌకలపై ప్రత్యేక ఛార్జీ విధించింది?
అమెరికా యాజమాన్యంలోని, అమెరికా నిర్వహించే లేదా ఆ దేశపు జెండాలతో వచ్చే ఓడలపై ఛార్జీ విధించింది.
ఈ కొత్త ఛార్జీ నుంచి ఏ నౌకలకు మినహాయింపు లభిస్తుంది?
చైనాలో నిర్మించిన నౌకలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: