ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా(America)-ఇజ్రాయెల్ (Israel) దళాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన అటాక్‌లో.. దక్షిణ ఇరాన్(Iran)లోని మినాబ్ ప్రాంతంలో ఉన్న ఓ బాలికల స్కూల్‌పై క్షిపణి పడింది. ఆ పేలుడు ఘటనలో సుమారు 160 మంది వరకు విద్యార్థిణులు మరణించారు. ఆ విషాద సంఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఆ దాడి వెనుక అమెరికా ఉన్నట్లు ఇరాన్ ఆరోపించగా, బాలికల స్కూల్‌పై తాము దాడి చేయలేదని ట్రంప్ అన్నారు. అయితే తాజాగా మినాబ్ స్కూల్‌పై మిస్సైల్ పడుతున్న ఘటనకు చెందిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నది. ఆ వీడియో ఫూటేజ్ ఆధారంగా అది అమెరికా వాడే తోమాహాక్ క్షిపణి(Tomahawk Missile)గా గుర్తించారు. మెహర్ న్యూస్ ఏజెన్సీ ఆ వీడియోను షేర్‌చేసింది.
Read Also: Iran Israel War: ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?
ఇంటెలిజెన్స్ సమాచారం వల్ల ఆ వైఫల్యం
శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా అమెరికాకు చెందిన మీడియా సంస్థలు కూడా ఆ క్షిపణి అమెరికాదే అని నిర్ధారించాయి. స్కూల్ సమీపంలో ఉన్న ఐఆర్జీసీ నావల్ కాంప్లెక్స్‌ను టార్గెట్ చేసే క్రమంలో బహుశా ఆ క్షిపణి స్కూల్‌పై పడి ఉంటుందని వాషింగ్టన్ పోస్టు తన కథనంలో చెప్పింది. ఇంటెలిజెన్స్ సమాచారం వల్ల ఆ వైఫల్యం జరిగి ఉంటుందని సీబీఎస్ న్యూస్ తన కథనంలో పేర్కొన్నది. ఇరాన్‌పై దాడిలో తోమాహాక్ క్షిపణులను వాడినట్లు అమెరికా చెబుతోంది. ఆ క్షిపణులు సుమారు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగలవు. ప్రస్తుతం జరుగుతున్న వార్‌లో కేవలం అమెరికా వద్దే ఇలాంటి ఆయుధాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.