World Cancer Day 2026: నేడు వరల్డ్ క్యాన్సర్ డే

Read Time:  1 min
World Cancer Day 2026: నేడు వరల్డ్ క్యాన్సర్ డే
FONT SIZE
GET APP

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేను నిర్వహిస్తారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే 90% క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పీచు పదార్థాలు తింటూ రోజూ వ్యాయామం చేస్తే వ్యాధి ముప్పు తగ్గుతుందంటున్నారు. ‘శరీరంలో గడ్డలు, మచ్చలు, దీర్ఘకాలిక మార్పులు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రాథమిక దశలో వ్యాధి నిర్ధారణే మన ప్రాణాలను కాపాడుతుంది’ అని సూచిస్తున్నారు.

Read Also: OpenAI: అమెరికాలో చాట్‌జీపీటీ సేవలకు అకస్మాత్తుగా అంతరాయం

Today is World Cancer Day 2026
Today is World Cancer Day 2026

రోగులు క్యాన్సర్ గురించి ముందస్తు సమాచారం అందుకుంటే లేదా దాని లక్షణాలను గుర్తిస్తే చికిత్స చేయడం సులభం. అంతేకాకుండా సకాలంలో ప్రాణాంతక పరిస్థితుల్ని నివారించవచ్చు. ఈ సంవత్సరం థీమ్ ‘యునైటెడ్ బై యునిక్’. క్యాన్సర్ బారిన పడిన ప్రతి వ్యక్తి వ్యక్తిగత ప్రయాణం, అవసరాలు, అనుభవాల్ని అనుసంధానించడం ఈ థీమ్ లక్ష్యం.

5 రకాల క్యాన్సర్లు ఏంటి?

​WHO నివేదిక ప్రకారం రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దపేగు – పురీషనాళ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ , చర్మ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. 2020లో సుమారు 2.26 మిలియన్ల కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.