📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Times100 : జాబితాలో భారతీయులకి చోటు దక్కలేదు

Author Icon By Digital
Updated: April 18, 2025 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టైమ్స్ ప్రభావవంతుల జాబితాలో భారతీయులకీ చోటు దక్కలేదు

Times100 : ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచ రాజకీయ, సాంకేతిక, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు చోటు దక్కించుకున్నప్పటికీ, భారతీయులకు మాత్రం ఈసారి అవకాశం దక్కలేదు. ఇది ఇటీవలి కాలంలో అరుదుగా జరిగే పరిణామం.టైమ్ మ్యాగజైన్ ఈ జాబితాను “లీడర్స్”, “ఐకాన్స్”, “టైటాన్స్”, “ఆర్టిస్ట్స్”, “ఇన్నొవేటర్స్” వంటి విభాగాలుగా విడగొట్టి ప్రకటించింది. ఇందులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్, సిరియా నేత అహ్మద్ అలారా వంటి నేతలు చోటు దక్కించుకున్నారు.అంతేకాక, పాపులర్ కళాకారులు, క్రీడాకారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. నటి డెమి మూర్, రాపర్ స్నూప్ డాగ్, మాజీ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, ప్రముఖ పాప్ గాయకుడు ఎడ్ షీరన్, గూగుల్ డీప్ మైండ్ సహవ్యవస్థాపకుడు డెమిస్ హస్సాబిస్ వంటి వారు ఈ జాబితాలోకి వచ్చారు. అయితే ఇందులో ఏ భారతీయుడు లేకపోవడం గమనార్హం.

Times100 : జాబితాలో భారతీయులకి చోటు దక్కలేదు

భారతీయుల గైర్హాజరీతో టైమ్స్ ప్రభావవంతుల జాబితా విడుదల

గతేడాది బాలీవుడ్ నటి అలియా భట్, ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ జాబితాలో ఉన్నారు. అంతకు ముందు ఏడాది దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నటుడు షారుఖ్ ఖాన్‌లకు స్థానం లభించింది. ఈసారి మాత్రం వారే కాక, మరెవరికీ చోటు దక్కకపోవడం నిరాశ కలిగించే విషయం.అయితే, భారతీయ మూలాలు కలిగిన వ్యక్తుల్లో ఒకరైన రేష్మ కెవల్రామణి మాత్రం ఈసారి టైమ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె వక్స్ ఫార్మా కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. రేష్మ ముంబయిలో జన్మించి, 11 ఏళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లారు. ఆమె అమెరికాలోనే విద్యాబ్యాసం చేసి బయోటెక్నాలజీ రంగంలో అరుదైన స్థాయికి చేరుకున్నారు. ఫార్మా రంగంలో అద్భుత విజయాలు సాధించిన రేష్మ, అమెరికా అతిపెద్ద బయోటెక్ కంపెనీకి తొలి మహిళా సీఈఓగా నిలిచారు.ఈ నేపథ్యంలో టైమ్ మ్యాగజైన్ జాబితాలో భారతీయుల గైరుపస్థితి ప్రశ్నలు రేపుతోంది. అంతర్జాతీయంగా భారత్ ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో, ఈ జాబితాలో భారతీయులు లేకపోవడం విస్మయకరం. ఇదే సమయంలో భారత సంతతికి చెందిన వ్యక్తులకు గుర్తింపు లభించడం కొంత మేర ఊరటనిస్తుంది.

Read More : Trump : ఇటలీ ప్రధాని అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్

Breaking News in Telugu Global Leaders Google News in Telugu Indian Absence Indians in Time List Most Influential People Paper Telugu News Reshma Kewalramani Telugu News Today Time 100 Time Magazine 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.