📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Latest Telugu News: America-టిక్‌టాక్ రీఎంట్రీ..ట్రంప్ ప్లాన్ మాములుగా లేదుగా

Author Icon By Vanipushpa
Updated: September 29, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో టెక్‌టాక్ (America TikTok) యాప్ ఫీచర్ డిసైడ్ అయ్యింది. ఆ దేశంలో టిక్‌టాక్ సేవలు (TikTok in america) దేశీయ సంస్థలకు విక్రయించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నాయకత్వంలోని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో టెక్ దిగ్గజం ఒరాకిల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ కీలక పాత్ర పోషించనున్నాయి. చైనా(China) కు చెందిన మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌పై అమెరికా యూజర్ల డేటా భద్రత విషయంలో ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ఈ డీల్‌ను రూపొందించారు.

జాతీయ భద్రతకు ముప్పు!
టిక్‌టాక్ చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్ యాజమాన్యంలో ఉంది. దీని ద్వారా అమెరికన్ యూజర్ల వ్యక్తిగత సమాచారం చైనా ప్రభుత్వానికి చేరే అవకాశం ఉందని, ఇది జాతీయ భద్రతకు ముప్పు అని అమెరికా నాయకులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024లో అప్పటి ప్రభుత్వం చట్టం తీసుకురాగా, దాని ప్రకారం టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీలకు విక్రయించాలి లేదా ఆ దేశంలో నిషేధించాలని నిర్ణయించుకున్నారు.

America-టిక్‌టాక్ రీఎంట్రీ..ట్రంప్ ప్లాన్ మాములుగా లేదుగా

ట్రంప్ కీలక నిర్ణయం
ఈ చట్టం గడువు ముగుస్తున్న నేపథ్యంలో టిక్‌టాక్‌(TikTok) ను నిషేధించకుండా, అమెరికన్ నియంత్రణలోకి తీసుకురావడానికి అధ్యక్షుడు ట్రంప్ ఓ డీల్‌ను ఆమోదించారు. ఈ ఒప్పందం ద్వారా, ఒరాకిల్, సిల్వర్ లేక్ టెక్ కంపెనీలు టిక్‌టాక్ సేవల్లో అమెరికా మెజారిటీ వాటాను (దాదాపు 45% లేదా అంతకంటే ఎక్కువ) సొంతం చేసుకోనుంది. దుబాయ్‌కు చెందిన ఎంజీఎక్స్ ఫండ్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌కు మైనారిటీ వాటా (20% కంటే తక్కువ) మాత్రమే ఉంటుంది.

ఒరాకిల్ పాత్రే కీలకం:
ఈ డీల్‌లో ఒరాకిల్ పాత్ర అత్యంత కీలకం. అమెరికన్ యూజర్ల డేటా అంతా పూర్తిగా అమెరికాలోని ఒరాకిల్ క్లౌడ్ సర్వర్‌లలో భద్రపరచబడుతుంది. అంతేకాకుండా, టిక్‌టాక్ అత్యంత ముఖ్యమైన ఆల్గరిథమ్ పై నియంత్రణ, భద్రతా పర్యవేక్షణ కూడా ఒరాకిల్‌కు దక్కుతుంది. ఈ విధంగా, అమెరికన్ల డేటా చైనా ప్రభుత్వానికి అందుబాటులో లేకుండా చూసేందుకు ఈ ఏర్పాటు చేశారు.

అమెరికన్ నియంత్రణతో టిక్‌టాక్

ఈ ఒప్పందం ద్వారా, అమెరికన్ల ఫేమస్ యాప్‌ను కాపాడుకోవడంతో పాటు, జాతీయ భద్రతా ఆందోళనలను పరిష్కరించినట్లైందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ టేకోవర్ ద్వారా అమెరికన్ పెట్టుబడిదారులు, ఉద్యోగుల ప్రయోజనాలు కూడా రక్షించబడతాయని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి అమెరికన్ నియంత్రణతో టిక్‌టాక్ అమెరికాలో తన కార్యకలాపాలను కొనసాగించనుంది.

టిక్‌టాక్ దేనికి ఉపయోగించబడుతుంది?
టిక్‌టాక్‌ను షార్ట్-ఫామ్ వీడియోలను సృష్టించడం, షేర్ చేయడం, ఎడిట్ చేయడం మరియు కనుగొనడం కోసం ఉపయోగిస్తారు. వినియోగదారులు కామెడీ, డ్యాన్స్, విద్యా కంటెంట్, వంట మరియు వ్యక్తిగత కథనాలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై వీడియోలను పోస్ట్ చేయవచ్చు.

టిక్‌టాక్ ఎందుకు అంత ప్రజాదరణ పొందింది?
టిక్‌టాక్ ఎందుకు అంత ప్రజాదరణ పొందింది? - రాచెల్ పెడెర్సెన్
వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను అందించే దాని అత్యంత ప్రభావవంతమైన అల్గోరిథం, చిన్న, వినోదాత్మక వీడియోలను రూపొందించడానికి దాని ఉపయోగించడానికి సులభమైన సాధనాలు మరియు ప్రసిద్ధ సంగీతం మరియు ట్రెండ్‌ల ఏకీకరణ నుండి టిక్‌టాక్ ప్రజాదరణ పొందింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu social media regulations USA Telugu News Today TikTok ban update TikTok political news TikTok US return Trump tech policies Trump TikTok strategy Trump vs TikTok US-China tech war

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.