📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

America: రెనీ నికోలో గుడ్‌ కు వేలాదిమంది సంఘీభావం

Author Icon By Vanipushpa
Updated: January 12, 2026 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)లోని మిన్నెయాపోలిస్ ఇమ్మిగ్రేషన్ ఏజంట్ చేతిలో హత్యకు గురైన వలస మహిళ 37 ఏళ్ల రినీ నికోల్ గుడ్ (Renee Nicolo Good)కు దేశవ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తింది. ఆమెను ఐసీఈ ఏజెంట్ కాల్చి చంపాడాన్ని నిరసిస్తూ దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. మినియాపోలిస్‌లో బుధవారం ఇమిగ్రేషన్‌ ఏజెంట్‌ ఒకరు 37 ఏండ్ల మహిళను కాల్చి చంపారు. రెనీ నికోలో గుడ్‌ అనే మహిళ కారులో వస్తుండగా, ఆమె ఇంటికి సమీపంలో అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) ఏజెంట్‌ ఒకరు ఆమెను కాల్చి చంపారు. బుధవారం మినియాపాలిస్‌లో అధికారులు ఇమిగ్రేషన్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు. దీనికి వ్యతిరేకంగా నిరసనకారులు ఉద్యమానికి దిగారు. ఈ క్రమంలో కారులో కూర్చున్న నికోలోపై అధికారులు కాల్పులు జరిపారు. వలస దారులపై ట్రంప్‌ నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్‌లో గ్రాడ్యుయేట్‌ అయిన రెనీ కవయిత్రి కూడా.

Read Also: US: పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

America: రెనీ నికోలో గుడ్‌ కు వేలాదిమంది సంఘీభావం

ఆమె “స్థానిక ఉగ్రవాది” ట్రంప్

ఆమె రాసిన కవిత్వానికి అవార్డు కూడా వచ్చింది. గిటార్ వాయిస్తారు. ఆమె ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలకు న్యాయ పరిశీలకురాలిగా ఉన్నారని నగర నాయకులు తెలిపారు. అయితే ఆమె “స్థానిక ఉగ్రవాది” అని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. ఆమె మరణాన్ని నిరసిస్తూ దేశం అంతటా “రీనికి న్యాయం జరగాలి” అని రాసి ఉన్న ప్లకార్డులతో ప్రదర్శనలు చేపట్టారు. అధికారితో ఘర్షణ సమయంలో తన కుమార్తె అతనితో ఘర్షణ పడి ఉండవచ్చని ఆమె తల్లి డొన్నా గాంగర్ మిన్నెసోటా స్టార్ ట్రిబ్యూన్‌తో చెప్పారు.ఈ ఘర్షణలో అధికారి ఆమెను కాల్చి చంపారని, తాను చూసిన వ్యక్తులలో తన కుమార్తె అత్యంత దయగల వ్యక్తి అని ఆమె అన్నారు. “ఆమె కరుణామయురాలు. తన జీవితాంతం అందర్నీ జాగ్రత్తగా చూసుకున్నారు. ఆమెకు క్షమించే హృదయం ఉంది” అని గాంగర్ వార్తాపత్రికతో చెప్పారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

America news community support Human Rights Mass Support Protest in America Public Solidarity Renee Nicolo Good social movement Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.