📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran-Israel war : ఇది చారిత్రక విజయం – నెతన్యాహు

Author Icon By Sudheer
Updated: June 25, 2025 • 5:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌తో జరిగిన 12 రోజుల తీవ్ర యుద్ధం (Iran-Israel war) తర్వాత ఇజ్రాయెల్ ఘన విజయం సాధించిందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Israel PM Netanyahu ) ప్రకటించారు. ఈ విజయం ఇజ్రాయెల్ చరిత్రలోనే నిలిపోయిందన్నారు , ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించేలా ఉండనుందని ఆయన తెలిపారు. ఈ విజయాన్ని తరతరాలపాటు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు ఇస్తున్నాయని నెతన్యాహు వివరించారు.

న్యూక్లియర్ ముప్పుని నివారించాం : నెతన్యాహు స్పష్టత

ఇరాన్ నుంచి వస్తున్న న్యూక్లియర్ బాంబులు, 20 వేల బాలిస్టిక్ క్షిపణుల ముప్పును ఇజ్రాయెల్ విజయవంతంగా అరికట్టిందని నెతన్యాహు తెలిపారు. “ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను పూర్తిగా ధ్వంసం చేశాం. భవిష్యత్తులో దాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే, వారికి సరైన బుద్ధి చెబుతాం” అని ఆయన హెచ్చరించారు. దేశ రక్షణకు తీసుకున్న చర్యలు ఇప్పటివరకు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు.

భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి యత్నాలు ఊహలోనూ చేయొద్దు

ఈ విజయం ద్వారా శత్రు దేశాలకు స్పష్టమైన సంకేతం వెళ్లిందని నెతన్యాహు అన్నారు. “ఇజ్రాయెల్‌ను అస్థిరం చేయాలన్న ప్రయత్నాలు భవిష్యత్‌లో విఫలమవుతాయి. ఎవరైనా మళ్లీ ఇలాంటి యుద్ధోన్మాద చర్యలకు పాల్పడాలనుకుంటే, ముందే తగిన అనుభవం పొందినట్లే అవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు కూడా ఈ పరిణామాలపై సానుకూలంగా స్పందిస్తున్నాయని తెలిపారు.

Read Also : Rajnath Singh : త్రివిధ దళాధిపతికి కీలక అధికారాలు

Google News in Telugu historic victory Iran-Israel War Netanyahu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.