📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Pahalgam Terror Attack: శౌర్యచక్ర అవార్డు గ్రహీత తల్లి పాకిస్తాన్ కు వెళ్తున్న వార్తల్లో నిజం లేదు

Author Icon By Anusha
Updated: April 30, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వీసాపై పాకిస్థాన్ నుంచి వచ్చినవాళ్లు, పాక్ జాతీయులు భారత్‌ను విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే, దేశంలోని పాకిస్థానీలను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ నుంచి 60 మంది పాకిస్థానీయులను వెనక్కి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాబితాలో శౌర్యచక్ర అవార్డు గ్రహీత తల్లి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగం కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ తల్లి షమీమా అక్తర్ కూడా ఈ లిస్టులో ఉన్నారని సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులపై అధికారులు స్పందించారు.ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఇదంతా తప్పుడు ప్రచారమని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అమరవీరుడు కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ తల్లిని స్వదేశానికి తిరిగి పంపించారనే ఆరోపణలపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం అవాస్తవం, నిరాధారమైంది నిర్ద్వంద్వమైనవి’ అంటూ బారాముల్లా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

విభాగం

జమ్మూ కశ్మీర్‌లో ఉంటున్న 60 మంది పాకిస్థాన్ జాతీయులను ప్రభుత్వం గుర్తించింది. వారిని వాఘా సరిహద్దులో పాకిస్థాన్ అధికారులకు అప్పగిస్తారు. 2010 పునరావాస విధానం కింద కశ్మీర్ వచ్చిన మాజీ ఉగ్రవాదుల భార్యలు కూడా ఈ 60 మందిలో ఉన్నారు. ఈ 60 మందిలో కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ తల్లి షమీమా అక్తర్ కూడా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ చేస్తున్నారు. 2022లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన ముదాసిర్ జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగం నిర్వహించే అండర్ కవర్ ఆపరేషన్‌లో సభ్యుడు.ముదాసిర్ మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనకు శౌర్యచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. మే 2023లో షమీమా, ఆమె భర్త కలిసి రాష్ట్రపతి నుంచి ఆ అవార్డును అందుకున్నారు. పోలీసుల ప్రకటనకు ముందు ముదాసిర్ బాబాయి మహమ్మద్ యూనుస్ మీడియాతో మాట్లాడుతూ ‘షమీమాది పాక్ ఆక్రమిత కశ్మీర్. అది మన భూభాగం. ఆమె 20 ఏళ్ల వయసులో ఇక్కడకు వచ్చింది. 45 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తోంది. పాకిస్థానీలను మాత్రమే బహిష్కరించాలని మోదీ, అమిత్‌షాను కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.

కృతజ్ఞతలు

పోలీసుల ప్రకటన తర్వాత యూనుస్ ‘ముదాసిర్ తల్లి పేరు నిర్బంధితుల జాబితాలో లేదు.. ఆమె తిరిగి ఇంటికి వచ్చారు. భారత ప్రభుత్వానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని తెలిపారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌లు ముదాసిర్ ఇంటికి వెల్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. షమీమా 1990ల్లో మహమ్మద్‌ మక్సూద్‌ను పెళ్లి చేసుకుంది. మక్సూద్‌ రిటైర్డ్ పోలీసు అధికారి. ముదాసిర్ గుర్తుగా బారాముల్లాలోని ప్రధాన కూడలికి షహీద్ ముదాసిర్ చౌక్ అని పేరు పెట్టారు.

Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫొటో వివాదం

#DeportationMove #IndiaSecurity #MHAIndia #PahalgamAttack #PakistanNationals #VisaOrder Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Telugu News Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.