📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: US Passport: బలహీనపడిన యూఎస్ పాస్‌పోర్ట్

Author Icon By Aanusha
Updated: October 14, 2025 • 11:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Henley Passport Index) తాజా నివేదికలో అమెరికా అగ్రరాజ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత 20 ఏళ్లుగా ఎప్పుడూ టాప్ 10లో స్థానం దక్కించుకున్న యునైటెడ్ స్టేట్స్ పాస్‌పోర్ట్ .అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ (IATA – International Air Transport Association) డేటా ఆధారంగా హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ రూపొందించిన ఈ ర్యాంకింగ్స్ ప్రకారం, అమెరికా ఇప్పుడు 12వ స్థానానికి పడిపోయింది.

Read Also: America: భారత్ ను టారిఫ్ లు ఏమీ చేయలేవు: ఐఎంఎఫ్

ప్రస్తుతం మలేషియాతో కలిసి యూఎస్ ఈ స్థానంలో ఉంది.ఒకప్పుడు, అంటే 2014లో, ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా (Visa) లేకుండా ప్రయాణించగలుగుతున్నారు. మరోవైపు, ఈ జాబితాలో సింగపూర్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలకు వీసా ఫ్రీ సదుపాయంతో వెళ్లవచ్చు. ఆ తర్వాత స్థానాల్లో దక్షిణ కొరియా (190), జపాన్ (189) ఉన్నాయి.అమెరికా ర్యాంక్ పడిపోవడానికి పలు దేశాలు తమ వీసా నిబంధనలను మార్చడమే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది.

కొత్త ప్రవేశ ఆంక్షలు విధించడం

ఈ ఏడాది బ్రెజిల్ వీసా (Brazil visa) రహిత ప్రవేశాన్ని రద్దు చేయడం, వీసా అవసరం లేని దేశాల జాబితాలో అమెరికాను చైనా చేర్చకపోవడం, మయన్మార్, పపువా న్యూగినియా వంటి దేశాలు కొత్త ప్రవేశ ఆంక్షలు విధించడం యూఎస్ ర్యాంక్‌పై ప్రభావం చూపాయి.

US Passport

తాజాగా వియత్నాం, సోమాలియా కూడా అమెరికన్లకు (Americans) వీసా నిబంధనలను కఠినతరం చేశాయి.ఈ విషయంలో యూకే పరిస్థితి కూడా బాగోలేదు. గతంలో టాప్‌లో ఉన్న బ్రిటన్, ఇప్పుడు ఆరో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది.

గత పదేళ్లలో చైనా తన పాస్‌పోర్ట్

ఆసక్తికరంగా, హెన్లీ ఓపెన్‌నెస్ ఇండెక్స్ ప్రకారం, ఇతర దేశాల పౌరులను ఆహ్వానించడంలో అమెరికా చాలా వెనుకబడి ఉంది. అమెరికా (America) పౌరులకు 180 దేశాలు వీసా ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా, అమెరికా మాత్రం కేవలం 46 దేశాల పౌరులను మాత్రమే వీసా లేకుండా తమ దేశంలోకి అనుమతిస్తోంది.

దీంతో ఈ జాబితాలో అమెరికా 77వ స్థానంలో నిలిచింది.మరోవైపు చైనా ఈ విషయంలో వేగంగా దూసుకెళుతోంది. గత పదేళ్లలో చైనా తన పాస్‌పోర్ట్ ర్యాంకును 94 నుంచి 64కు మెరుగుపరుచుకుంది. అంతేకాకుండా, 76 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తూ ఓపెన్‌నెస్ ఇండెక్స్‌లో 65వ స్థానంలో నిలిచి అమెరికాను అధిగమించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Henley Passport Index latest news Telugu News US passport ranking

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.