పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తున్నట్లు కెనడా, ఆస్ట్రేలియా, యూకే ప్రకటించింది. పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన తొలి జీ7 దేశంగా కెనడా నిలిచింది. ఈరోజు నుంచి ‘పాలస్తీనా దేశాన్ని కెనడా గుర్తిస్తోంది’ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఒక పోస్టు చేశారు. ‘పాలస్తీనాను దేశంగా కెనడా గుర్తిస్తోంది. పాలస్తీనాతో పాటు ఇశ్రాయెల్.. రెండింటి శాంతియుత భవిష్యత్తు నిర్మాణంలో కెనడా భాగస్వామ్యం అందిస్తుంది’ అని ఆయన రాశారు.
ఆస్ట్రేలియా కూడా గుర్తించింది ఆస్ట్రేలియా కూడా పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తుననట్లు ప్రకటించింది. పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన రెండో జీ7 దేశంగా నిలిచింది. ఈవారం న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కెనడా, ఆస్ట్రేలియా రెండూ పాలస్తీనాను అధికారికంగా గుర్తించనున్నట్లు ప్రకటించాయి. పాలస్తీనాను సార్వభౌమ రాజ్యంగా గుర్తించాలనే కోనడా నిర్ణయాన్ని ఆస్ట్రేలియా అనుసరించిందని ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్(Anthony Albanese) రాశారు. ఇది కెనడా, బ్రిటన్ లతో చేసిన సంయుక్త ప్రయత్నంలో భాగమని, టూ స్టేట్ సొల్యూషన్ (రెండు దేశాల)ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు.
ఇశ్రాయెల్ ఏమంటున్నది?
పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తూ యూకే, కొన్ని ఇతర దేశాలు చేసిన ఏకపక్ష ప్రకటనను ఇజ్రాయెల్ నిర్ద్వంద్యంగా తిరస్కరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఎక్స్ పోస్టు చేసింది. ‘ఈ ప్రకటన శాంతిని ప్రోత్సహించదు, దీనికి విరుద్ధంగా ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరపరుస్తుంది. భవిష్యత్తులో శాంతియుత పరిష్కారాన్ని సాధించే అవకాశాలను దెబ్బతీస్తుంది’ అని తెలిపింది. గతంలో, పాలస్తీనాకు గుర్తింపుపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమెన్ నెతన్యాహు మాట్లాడారు. గతనెలలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కు లేఖ రాస్తూ, ‘ఈ యూదు వ్యతిరేక అగ్నికి ఆజ్యం పోస్తున్నారి’ ఆరోపించారు. అయితే, దీనికి ఫ్రెంచ్ ప్రభుత్వం బదులిస్తూ, ‘ఇలాంటి సమయాల్లో గందరగోళం, పరిస్థితుల తారుమారు కంటే బాధ్యతను, అక్కడి తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఫ్రెంచ్ ప్రభుత్వం బదులిచ్చింది.
ఇటీవల పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన దేశాలు ఏవి?
మూడు దేశాలు తాజాగా పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి.
పాలస్తీనాను గుర్తించడం ఎందుకు ప్రాధాన్యం సంతరించుకుంది?
ఇది ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: