📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

RCB: ఫ్రీ టిక్కెట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారంతోనే ఉద్రిక్తత

Author Icon By Shobha Rani
Updated: June 5, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (RCB) జట్టు ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేరిన వేళ, విజయోత్సవ సభ విషాదానికి దారి తీసింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. తొక్కిసలాటకు ఉచిత పాస్‌లు ఇస్తున్నారనే వదంతులు వ్యాపించడం, స్టేడియం గేట్లను మూసివేయడం, ఊహించని రీతిలో జనం పోటెత్తడం వంటి అంశాలు కారణమయ్యాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం వాస్తవ సామర్థ్యం 35 వేల మంది మాత్రమే కాగా, బుధవారం సాయంత్రానికి దాదాపు మూడు లక్షల మంది అభిమానులు స్టేడియం పరిసరాలకు చేరుకున్నారు.
ఫ్యాన్స్ ఆరోపణలు – నిర్లక్ష్యమే కారణమా?
స్టేడియంలో మొత్తం 21 స్టాండ్‌లు, 13 గేట్లు ఉన్నాయి. వీటిలో 9, 10 నంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యుల కోసం కేటాయించారు. మిగిలిన గేట్లలో 5, 6, 7 నంబర్ గేట్ల ద్వారా అభిమానులను లోపలికి అనుమతించారు. ముఖ్యంగా, 7వ నంబర్ గేటు నుంచి స్టేడియం ప్రధాన ప్రవేశ ద్వారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్సీబీ (RCB) జట్టు ఇదే మార్గం గుండా మైదానంలోకి వస్తుందన్న ఉద్దేశంతో అభిమానులు అత్యధిక సంఖ్యలో ఈ గేటు వద్దకే చేరుకున్నారు. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే స్టేడియంలోకి ప్రవేశం కల్పించారు. అయితే, పాస్‌లు లేనివారు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో, 7వ నంబర్ గేటు వద్ద ఉచితంగా టికెట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో, టికెట్ల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని, ఎక్కువ నష్టం ఈ గేటు వద్దే సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

RCB: ఫ్రీ టిక్కెట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారంతోనే ఉద్రిక్తత

అధికార ప్రకటనల గందరగోళం
స్టేడియం వద్ద రద్దీని అదుపు చేసేందుకు సుమారు 5 వేల మంది పోలీసులను మోహరించినప్పటికీ, ఊహించిన దానికంటే కొన్ని రెట్లు అధికంగా అభిమానులు తరలిరావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు సవాలుగా మారింది. స్టేడియం గేట్లు కూడా ఇరుకుగా ఉండటం వల్ల అభిమానులు లోపలికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. “స్టేడియం గేట్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. జనం కిక్కిరిసిపోవడంతో కొన్ని గేట్లు విరిగిపోయాయి. అంచనాలకు మించిన రద్దీ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నాం” అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. అయితే, తమ వద్ద పాస్‌లు ఉన్నప్పటికీ, గేట్లు మూసివేసి లోపలికి అనుమతించలేదని కొందరు అభిమానులు ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ (RCB) జట్టు విజయోత్సవ పరేడ్ నిర్వహిస్తుందని ఆ జట్టు యాజమాన్యం తొలుత ఉదయం ప్రకటించింది. అయితే, అభిమానుల భారీ రాకను ముందే ఊహించిన పోలీసులు, శాంతిభద్రతల దృష్ట్యా ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ఆర్సీబీ (RCB) జట్టు పరేడ్ ఉండదని, కేవలం స్టేడియంలో సన్మాన కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఉదయం 11:56 గంటలకు స్పష్టం చేశారు.
ప్రభుత్వ స్పందన – దర్యాప్తు ఆదేశం
కానీ, మధ్యాహ్నం ఆర్సీబీ (RCB) యాజమాన్యం మరోసారి ప్రకటన చేస్తూ, పరేడ్ యథావిధిగా జరుగుతుందని, అభిమానులు మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పరేడ్ జరుగుతుందో లేదో తెలియని అయోమయంతో, చాలామంది నేరుగా మైదానంలోకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో, టికెట్లు లేని కొందరు గేట్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, వారిని అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని, దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఒక్కో సంఘటన వెనుక వ్యవస్థాపక లోపాలు, దృష్టి త‌ప్పిదాలు ఎంత తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో చిన్నస్వామి స్టేడియం ఘటన మరోసారి స్పష్టంగా తెలిపింది. ఆట ఉత్సాహంగా ఉండాలి కానీ వ్యవస్థాపితంగా, భద్రతగా ఉండాలని ఇప్పుడు ప్రతి ఫ్రాంచైజీ, ప్రభుత్వ యంత్రాంగం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.

Read Also: RCB: ఆర్సీబీ ఘటనపై హైకోర్టులో కేసు

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today that free tickets are being distributed The tension is due to the propaganda Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.