📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Plane crash: కళ్లముందే ఘోరం.. కన్నీటితో టేకాఫ్: పైలట్ల ఆవేదన

Author Icon By Shobha Rani
Updated: June 14, 2025 • 2:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కళ్ల ముందే ఘోర ప్రమాదం.. అక్కడ పరిస్థితి పూర్తిగా చక్కబడనే లేదు. ఆ తర్వాత అదే ఎయిర్ పోర్ట్ (Airport) నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన, ల్యాండింగ్ చేయాల్సిన పైలట్ల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఓవైపు తోటి పైలట్ కాలిబూడిదయ్యారనే విషాదం, మరోవైపు ఈ టేకాఫ్ సాఫీగా జరుగుతుందో లేదోననే ఆందోళనతో కొట్టుమిట్టాడుతారని వివరించారు. గురువారం అహ్మదాబాద్ (Ahmedabad) లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు నాలుగు గంటల పాటు బ్రేక్ ఇచ్చారు.
శిక్షణ ఉన్నా గుండె కోత తప్పదు
ఎంత కఠినమైన శిక్షణ పొందినప్పటికీ, ఇలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత దాని ప్రభావం ఎంతోకొంత పైలట్లపై పడుతుందన్నారు. ఈ ఘటనలు వారిలో భయాన్ని రేకెత్తిస్తాయని, అయితే తమ శిక్షణ, వృత్తి నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే దృక్పథంతో వారు విధులను కొనసాగిస్తారని చెబుతున్నారు.

Plane crash: కళ్లముందే ఘోరం.. కన్నీటితో టేకాఫ్: పైలట్ల ఆవేదన

నాగార్జున ద్వారకానాథ్ వ్యాఖ్య
నాగార్జున ద్వారకానాథ్ అనే కమర్షియల్ పైలట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రభావితం కాకుండా ఉండటం అసాధ్యం. ‘తదుపరి నేను కాకూడదు’ అనే ఆలోచన మనసులో మెదులుతుంది” అని అన్నారు. 2006లో గోవా(Goa) లోని డబోలిమ్ విమానాశ్రయంలో జరిగిన ఓ ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటూ, ఓ మాజీ నేవీ పైలట్, “ప్రమాదం గురించి రేడియోలో విన్న వెంటనే నేను ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. కళ్లలో నీళ్లు, గుండె దడతోనే విమానం ల్యాండ్ చేశాను. ఆ ప్రమాదంలో మరణించిన పైలట్ నాకు పదేళ్లుగా తెలుసు. శిక్షణ, అలవాటైన పనులే నన్ను సురక్షితంగా ల్యాండ్ చేశాయి.
పైలట్ల మనసు.. రన్న్వే మీద ప్రయాణిస్తూనే వెదజల్లే బాధ
అహ్మదాబాద్ (Ahmedabad) విమానాశ్రయంలో ప్రమాదం తర్వాత టేకాఫ్ తీసుకున్న పైలట్లకు ఇది “చాలా సవాలుతో కూడుకున్నది” అని మరో పైలట్ అభిప్రాయపడ్డారు. ప్రమాదం తర్వాత విమానాశ్రయ కార్యకలాపాలను నాలుగు గంటలపాటు నిలిపివేయడం కొంతవరకు పైలట్లు కోలుకోవడానికి సహాయపడిందని కొందరు నిపుణులు తెలిపారు. “ఇలాంటి మరణాలను దగ్గర నుంచి చూడటానికి ఏ శిక్షణా సిద్ధం చేయలేదు. కూడదీసుకుని, తిరిగి విధుల్లోకి వస్తారు” అని ఒక గ్లోబల్ క్యారియర్‌కు చెందిన పైలట్ అన్నారు.

Read Also: Air India: విమాన బాధితులకు సమగ్ర మద్దతునివ్వండి..

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Takeoff in tears: Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The horror unfolded before our eyes.. Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.