📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

First Tea Shop In India: దేశంలోనే మొట్టమొదటి టీ స్టాల్: మూడు తరాల చరిత్ర

Author Icon By Shobha Rani
Updated: June 10, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్–పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం, ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి టీ దుకాణానికి (First Tea Shop In India) నిలయంగా మారింది. భారత్- పాకిస్థాన్ సరిహద్దులో ఓ కుటుంబం గత మూడు తరాలుగా టీ షాప్​ను నిర్వహిస్తోంది. ఈ షాప్​ను అందరూ భారతదేశపు మొట్టమొదటి టీ దుకాణంగా పిలుస్తుంటారు. అసలు ఎప్పుడు ప్రారంభమైంది? భారతదేశంలోనే మొట్టమొదటి టీ దుకాణంగా (First Tea Shop In India) పేరొందిన షాపు 1984 కన్నా ముందు నుంచి నడుస్తోంది. దీని యజమాని సురేశ్ సింగ్. అతడి తండ్రి గుర్నామ్ సింగ్, తాత కూడా ఇదే టీ షాప్ నడిపేవారు. పంజాబ్​లోని ఫజిల్కాలోని అసఫ్​వాలా గ్రామంలో ఉందీ దుకాణం.
తాత – 1965 నుండి సేవ
గతంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉండేది. అయినా నేను నా దుకాణాన్ని మూసివేయలేదు. కానీ ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని భారత సైనికులకు చెప్పాను. మా తాత 1984కి ముందే ఈ దుకాణాన్ని నడపడం ప్రారంభించాడు. అప్పటి నుంచి మా కుటుంబంలోని తర్వాతి తరాలు ఈ దుకాణం నడపడంపై శ్రద్ధ చూపుతున్నాయి. దేశంలోని ఏదో ఒక రాష్ట్రం నుంచి కొంత మంది యువకులు సైనిక కవాతును చూడడానికి భారత సరిహద్దుకు వస్తుంటారు. వారు నా షాప్​లో టీ తాగినప్పుడు ఒక బోర్డును తయారు చేసి

First Tea Shop In India: దేశంలోనే మొట్టమొదటి టీ స్టాల్: మూడు తరాల చరిత్ర

ఇచ్చారు. భారతదేశపు మొదటి టీ షాప్ (First Tea Shop In India) అని మా దుకాణానికి వారు పేరు పెట్టారు. తొలుత తాను అసఫ్​వాలా గ్రామంలో ఫంక్చర్ దుకాణం ప్రారంభించానని, తర్వాత టీస్టాల్ ఓపెన్ చేశానని సురేశ్ సింగ్ తండ్రి గుర్నామ్ సింగ్ చెప్పారు. దాదాపుగా 50 ఏళ్ల క్రితం నుంచి టీ దుకాణం ఉందన్నారు. తన తాత 1965, 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధాలను చూశారని వెల్లడించారు. తాను చిన్నప్పటి నుంచి యుద్ధ వాతావరణాన్ని చూస్తూ పెరిగానని అన్నారు. కార్గిల్ యుద్ధంలో అయినా, ఇటీవల భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధంలోనైనా అసఫ్​వాలా గ్రామం భారత సైన్యానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు.
యుద్ధం నడుమ టీ సేవ: సైనికులకు అండగా
“నేను భారత్- పాక్ మధ్య జరిగిన 1971లో జరిగిన యుద్ధాన్ని చూశాను. కాల్పుల గురించి తెలియగానే మేము మా కుటుంబంతో కలిసి వేరే గ్రామానికి వెళ్లిపోయాం. తర్వాత మళ్లీ తిరిగి వచ్చాం. గ్రామస్థులు భారత సైన్యానికి సహాయం చేస్తున్నారు. అప్పట్లో పాక్ మా గ్రామాన్ని చుట్టిముట్టినప్పుడు మా తాతలు గ్రామాన్ని ఖాళీ చేశారు. ఇటీవలే అలా జరగలేదు. యుద్ధం ప్రారంభమైనప్పుడు మేము గ్రామాన్ని వదిలి వెళ్లలేదు. భారత సైన్యానికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరిహద్దు గ్రామాలలో ముఖ్యంగా భారత్-పాక్ బార్డర్ గ్రామాల్లో సాయంత్రం నిశ్శబ్దం ఉండటం తరచుగా కనిపిస్తుంది. కానీ అసఫ్​వాలా గ్రామంలో అలా కాదు. రిట్రీట్ వేడుక తర్వాత పర్యటకుల సందడి ఉంటుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు సురేశ్ సింగ్ టీ దుకాణానికి వచ్చి టీ తాగుతారు. అలాగే సమోసాలను రుచి చూస్తుంటారు. ఈ టీ స్టాల్ ఒక సెల్ఫీ పాయింట్​గా కూడా మారిపోయింది.ఈ టీ స్టాల్‌కి కేవలం చాయ్ దుకాణంగా కాకుండా దేశభక్తి, సైనికులకు మద్దతు, కుటుంబ వారసత్వం అనే గౌరవమైన అర్ధం కూడా ఉంది. ఇది అసఫ్‌వాలా గ్రామం గర్వకారణం, దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది.

Read Also: America: స్మ‌గ్లింగ్ ఆరోపణలతో వుహాన్ ల్యాబ్‌ పీహెచ్‌డీ విద్యార్థిని అరెస్టు చేసిన అమెరికా

A history of three generations Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The first tea stall in the country: Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.