📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Eiffel Tower: ఈఫిల్ టవర్ మూసివేత.. కారణం ఏంటంటే?

Author Icon By Aanusha
Updated: October 9, 2025 • 6:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫ్రాన్స్‌ (France) లో ఈ రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మెలు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఖర్చులను తగ్గించాలని, ధనవంతులపై పన్నులను పెంచాలని ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి దిగుతున్నారు. ఈ సాంఘిక ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా ప్యారిస్‌లోని ఐకానిక్ ఈఫిల్ టవర్‌ (Eiffel Tower) పై ఈ సమ్మెలు ప్రత్యక్షంగా ప్రభావం చూపాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం కొన్ని రోజుల పాటు ఈ ప్రసిద్ధి చిహ్నాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.

Taliban: భారత్‌ పర్యటనలో తాలిబన్ మంత్రి.. అధికారులకు కొత్త చిక్కులు

ఈనెల 2వ తేదీ నుంచి ఈఫిల్ టవర్ (Eiffel Tower) మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 136 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఈఫిల్ టవర్.. సమ్మెలు, 2015 పారిస్ దాడులు, కొవిడ్-19, ఈఫిల్ టవర్‌ (Eiffel Tower)ను ఎక్కేందుకు చేసిన ప్రయత్నాల సందర్భంగా గతంలో కూడా అనేకసార్లు తాత్కాలికంగా మూసివేశారు.

ఫ్రెంచ్ ప్రభుత్వం ఖర్చుల తగ్గింపు నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు.. ధనవంతులపై అధిక పన్నులు విధించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు.

రాజకీయ సంక్షోభం, బడ్జెట్ చర్చల నేపథ్యంలో

దీంతో అక్టోబర్ 2 వ తేదీ నుంచి 330 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్‌ (Eiffel Tower)ను మూసివేశారు. ఫ్రాన్స్‌లోని ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ దేశవ్యాప్త పిలుపుతో.. సమ్మె చేపట్టారు. రాజకీయ సంక్షోభం, బడ్జెట్ చర్చల నేపథ్యంలో గత నెలలో ప్రారంభమైన నిరసనలు ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

Eiffel Tower

లా డామ్ డి ఫెర్ (ఐరన్ లేడీ) అని పిలిచే ఈ ఈఫిల్ టవర్‌కు 136 ఏళ్ల చరిత్ర ఉండగా.. చాలాసార్లు మూసివేయబడింది. 2018 ఆగస్ట్‌ నెలలో.. ఈఫిల్ టవర్ వద్ద పనిచేసే ఉద్యోగులు వాకౌట్ చేయడంతో.. ఈఫిల్ టవర్‌ను సందర్శకుల నిర్వహణలో మార్పులు, టూరిస్ట్‌ల రద్దీని నిరసిస్తూ 2 రోజుల పాటు మూసివేశారు.

సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రాంతంలో అందర్నీ ఖాళీ చేయించారు

ఇక 2024 ఫిబ్రవరి నెలలోనూ ఈఫిల్ టవర్ నిర్వహణ, సిబ్బంది సంక్షేమం కోసం సరైన పెట్టుబడులు పెట్టడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ.. సమ్మె చేశారు.2019 మే నెలలో ఒక వ్యక్తి ఈఫిల్ టవర్‌ను ఎక్కేందుకు ప్రయత్నించడంతో భద్రతా కారణాలతో (security reasons) అక్కడ టూరిస్ట్‌లను ఖాళీ చేయించి మూసివేశారు.

2024 ఆగస్ట్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) ముగింపు వేడుకలకు కొన్ని గంటల ముందు.. ఈఫిల్ టవర్‌ను ఎక్కుతూ ఒక కనిపించడంతో వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రాంతంలో అందర్నీ ఖాళీ చేయించారు.2020 మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి కారణంగా ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా కొవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈఫిల్ టవర్‌ను మూసివేశారు.

2015 నవంబర్ నెలలో పారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల కారణంగా ఈఫిల్ టవర్‌ను అధికారులు కొన్ని రోజుల పాటు మూసివేశారు. 2023 డిసెంబర్ నెలలో ఈఫిల్ టవర్ సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో ఒక జర్మన్ టూరిస్ట్ హత్యకు గురి కావడంతో అప్పుడు మూసివేయబడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Eiffel Tower closure France strike latest news Paris protests Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.