📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Latest News: Cat: స్టేషన్‌ మాస్టర్‌గా పని చేసిన పిల్లి మృతి..ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: December 16, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జపాన్‌లోని వకయామా ప్రిఫెక్చర్, కినోకావాలో ఉన్న కీషి స్టేషన్‌కు స్టేషన్‌మాస్టర్‌గా సేవలందించిన ప్రియమైన కాలికో పిల్లి నితమా (Cat) అంత్యక్రియలకు 500 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. వకయామా ఎలక్ట్రిక్ రైల్వే కంపెనీ నిర్వహిస్తున్న కిషిగావా లైన్‌ను పర్యవేక్షించిన నితమా, అక్టోబర్ చివరి నుంచి ఆరోగ్యం క్షీణించడంతో నవంబర్ 20న 15 ఏళ్ల వయసులో కన్నుమూసింది.నితమా మరణానంతరం, ఆమె సేవలను గౌరవిస్తూ రైల్వే సంస్థ ఆమెను “గౌరవ ప్రత్యేక స్టేషన్‌మాస్టర్”గా ప్రకటించింది.

Read Also: Hyderabad Telugu Associations : అమెరికా తెలుగు సంఘాల సమావేశం ప్రవాసుల ముచ్చట…

ప్రజలను ఆకర్షించే వినూత్న ఆలోచన

జపాన్‌లోని వకయామా ఎలక్ట్రిక్ రైల్వే కంపెనీ నిర్వహిస్తున్న కిషిగావా లైన్ ఒకప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో, నిర్వహణ ఖర్చులు పెరిగి, ఈ రైల్వే లైన్‌ను పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కొన్ని స్టేషన్లలో మానవ సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు కొత్తగా, ప్రజలను ఆకర్షించే వినూత్న ఆలోచన ఏదైనా చేయాలని భావించారు.

అలాంటి సమయంలోనే వారికి ‘తమ’ అనే ఒక చిన్న పిల్లి కనిపించింది. అది చాలా ముద్దుగా ఉండడం, మనుషులతో స్నేహంగా కలిసిపోవడం రైల్వే అధికారులను ఆకట్టుకుంది. అప్పుడే ఓ వినూత్న ఆలోచన పుట్టింది. ఆ పిల్లినే కీషి స్టేషన్‌కు స్టేషన్ మాస్టర్‌గా నియమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చారు. 2007లో అధికారికంగా ‘తమ’ను స్టేషన్ మాస్టర్‌గా నియమించారు.

The cat that worked as a station master has died..where is it?

కీషి స్టేషన్‌ మాస్టర్‌గా నియమించారు

‘తమ’కు ప్రత్యేకంగా రైల్వే యూనిఫాం కూడా ఇచ్చారు. చిన్న క్యాప్, ఐడీ బ్యాడ్జ్‌తో ఆమె స్టేషన్ మాస్టర్‌లా కనిపించేది. విధుల సమయంలో స్టేషన్‌లోనే ఉంచేవారు. దీని వల్ల మొదటి సంవత్సరంలోనే రైల్వేకు 9.2 మిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. మొత్తం రైడర్‌షిప్‌ను 17 శాతం పెంచింది. అయితే దురదృష్టవశాత్తు 2015లో తమ చనిపోయింది. మరోవైపు కారు కింద పడి చనిపోబోతున్న ఓ పిల్లిని రక్షించిన రైల్వే అధికారులు.. దాన్ని దత్తత తీసుకుని శిక్షణ ఇప్పించారు.

దానికి నితమ అని పేరు పెట్టుకుని ఇడాకిసో స్టేషన్‌ మాస్టర్‌గా నియమించారు. చాలా రోజులు నితమా అక్కడ విధులు నిర్వర్తించింది. అయితే తమ చనిపోయిన తర్వాత నితమాను ఇక్కడకు తీసుకువచ్చి.. కీషి స్టేషన్‌ మాస్టర్‌గా నియమించారు. అప్పటి నుంచి ఇది ఇక్కడే పని చేస్తుంది. అయితే ప్రస్తుతం నితమా వయసు 20 ఏళ్లు కాగా.. దాదాపు పదేళ్ల నుంచి కీషి స్టేషన్‌లోనే పని చేస్తోంది.

ఇటీవలే నితమా చనిపోగా.. అంత్యక్రియలను కీషి స్టేషన్‌లోనే నిర్వహించారు.”నితమా అంకితభావంతో పనిచేసింది. దాని మృతిని తట్టుకోలేకపోతున్నాం. ఇకపై అది లేకుండానే మేము పని చేయాలి” అని వకయామా ఎలక్ట్రిక్ రైల్వే అధ్యక్షుడు మిత్సునోబు కొజిమా అన్నారు. నితమా వల్ల తమకు ఎంత లాభ వచ్చిందనే వివరాలను రైల్వే శాఖ వివరించనప్పటికీ.. ఆమె కూడా పర్యాటక రంగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Japan news Kishii Station latest news Nitama Cat Station Master Cat Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.