📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Copenhagen: ప్రపంచంలో అత్యుత్తమ నివాస నగరం: కోపెన్‌హాగన్

Author Icon By Shobha Rani
Updated: June 18, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలో జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్ (Copenhagen) నిలిచింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన “గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025″లో ఈ విషయం వెల్లడైంది. గత మూడేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న వియన్నాను వెనక్కి నెట్టి కోపెన్‌హాగన్ ఈసారి మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. స్థిరత్వం, విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో కోపెన్‌హాగన్ 100కి 100 మార్కులు సాధించడం విశేషం.
173 నగరాలు, 30 అంశాల ఆధారంగా విశ్లేషణ
ఈఐయూ నివేదిక కోసం ప్రపంచవ్యాప్తంగా 173 నగరాలను 30 అంశాల ఆధారంగా విశ్లేషించారు. ఇందులో స్థిరత్వం, వైద్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాలు వంటి కీలక విభాగాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఏడాది నగరాల సగటు స్కోరు 100కి 76.12గా నిలకడగా ఉంది.
ఆస్ట్రేలియా నగరాల ప్రదర్శన
ఈ జాబితాలో ఆస్ట్రేలియా(Australia)లోని మెల్‌బోర్న్ నాలుగో స్థానంలో నిలవగా, సిడ్నీ, అడిలైడ్ నగరాలు కూడా టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి. జపాన్, న్యూజిలాండ్, కెనడా దేశాలకు చెందిన నగరాలు కూడా ఉత్తమ స్థానాల్లో నిలిచాయి. కెనడాలోని వాంకోవర్ పదో స్థానంలో ఉంది.
లండన్ స్థానం క్షీణత
అయితే, లండన్ (London) వంటి ప్రఖ్యాత నగరాలు ఈసారి తమ ర్యాంకులను కోల్పోయాయి. అల్లర్లు, నిరాశ్రయుల సంఖ్య పెరగడం వంటి కారణాలతో లండన్ గత ఏడాది 45వ స్థానం నుంచి ఈసారి 54వ స్థానానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్, మాంచెస్టర్, ఎడిన్‌బరో నగరాల ర్యాంకులు తగ్గినట్లు తెలిపింది. ఉత్తర అమెరికాలోని 21 నగరాలు 80కి పైగా స్కోర్‌తో నివాసానికి అత్యంత అనుకూలమైనవిగా నిలిచాయి. అమెరికాలో హవాయిలోని హోనొలులు 23వ స్థానంతో ఉత్తమ నగరంగా నిలిచింది.
మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా నగరాల్లో పురోగతి
మరోవైపు, సౌదీ అరేబియా(Soudi Arabia), యూఏఈలలో వైద్య, విద్యా రంగాల్లో వచ్చిన పురోగతి కారణంగా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంత నగరాలు నివాసయోగ్యతలో మంచి వృద్ధిని కనబరిచాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా వైద్యం, విద్య, మౌలిక వసతుల సగటు స్కోర్లు స్వల్పంగా మెరుగుపడినట్లు నివేదిక వెల్లడించింది.

Copenhagen: ప్రపంంచంలో అత్యుత్తమ నివాస నగరం: కోపెన్‌హాగన్

ఈ జాబితాలో సిరియా రాజధాని డమాస్కస్ నివాసానికి అత్యంత అననుకూల నగరంగా అట్టడుగున నిలిచింది. లిబియాలోని ట్రిపోలి చివరి నుంచి రెండో స్థానంలో, బంగ్లాదేశ్‌లోని ఢాకా మూడో స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్‌లోని కరాచీ, అల్జీరియాలోని అల్జీర్స్ నగరాలు కూడా నివాసానికి తక్కువ అనుకూలమైన నగరాల జాబితాలో ఉన్నాయి.

Read Also: Modi: ట్రంప్ జీ భారత్-పాక్ ఒప్పందంలో మీ జోక్యం లేదుగా..మోదీ

#Copenhagen BestCityToLive Breaking News in Telugu Copenhagen GlobalLiveabilityIndex2025 Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The best city to live in the world: Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.