📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

South Korea: కొంప ముంచిన దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్య బ్యాగ్..ఏంటి ఆ కథ?

Author Icon By Vanipushpa
Updated: April 7, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అభిశంసన సరైనదేనని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 60 రోజుల్లోపు దక్షిణ కొరియాలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పార్లమెంట్‌లో అభిశంసన ఎదుర్కొని పదవి పోగొట్టుకున్న యూన్‌కు, రాజ్యాంగ ధర్మాసనం తీర్పూ వ్యతిరేకంగా వచ్చింది. 2022లో అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన యూన్ అసలు పార్లమెంటులో అభిశంసన ఎదుర్కొనే పరిస్థితి ఎలా వచ్చింది? ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి ? భార్యకు గిఫ్ట్ రూపంలో వచ్చిన బ్యాగ్ యూన్ రాజకీయ జీవితాన్ని ఎలా మార్చివేసింది?
లగ్జరీ బ్యాగ్ వివాదమేంటి?
గత ఏడాది యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడానికి కొన్ని నెలల ముందు ఆయన భార్య కిమ్ కియోన్ హీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కిమ్ కియోన్ హీ ఒక లగ్జరీ బ్యాగ్‌ను బహుమతిగా స్వీకరించారనే వివాదం పాలక పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ)ని ఏడాదిన్నర క్రితం గందరగోళంలో పడేసింది. 2023 చివర్లో బయటకు వచ్చిన స్పై కెమెరా ఫుటేజ్‌లో ఒక పాస్టర్ ఆమెకు డియోర్ అనే బ్రాండెడ్ బ్యాగ్‌ను బహుకరిస్తున్నట్టు కనిపించింది. ఈ వీడియో అప్పట్లో సంచలనంగా మారింది.

వామపక్ష యూట్యూబ్ చానల్ వాయిస్ ఆఫ్ సోల్ ప్రసారం చేసిన ఈ వీడియోను పాస్టర్ చోయ్ జే-యంగ్ తన వాచ్‌లో ఉన్న కెమెరాను ఉపయోగించి రహస్యంగా చిత్రీకరించినట్టు ప్రచారం జరిగింది. .
పాస్టర్ చోయ్ ఒక దుకాణానికి నడుచుకుంటూ వెళ్తున్నట్టు, బూడిద-నీలం రంగు లెదర్ బ్యాగ్‌ను కొనుగోలు చేసినట్టు ఆ వీడియోలో కనిపించింది. దాని ధర 3 మిలియన్ వోన్ (దాదాపు రూ. 1.75 లక్షలు ) అని రసీదు ఉంది. ఆ బ్యాగ్‌ను 2022 సెప్టెంబర్‌లో కిమ్‌కు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.

READ ALSO: Apple: అమెరికాకు ఐఫోన్ల ఎగుమతి:టారిఫ్ ల నుంచి తప్పించుకోవడానికి చర్యలు

The bag of the South Korean president's wife was soaked

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.