📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news: Thaksin Shinawatra – థాయ్‌ మాజీ ప్రధానికి మరో ఏడాది జైలుశిక్ష

Author Icon By Sudha
Updated: September 9, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

థాయ్‌లాండ్ మాజీ ప్రధాన మంత్రి థక్సిన్‌ షినవత్ర (Thaksin Shinawatra) కు ఆ దేశ సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. గతంలో ఓ కేసులో విధించిన శిక్షను షినవత్ర సరిగ్గా అనుభవించలేదనే కారణంతో మరోసారి ఏడాదిపాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.2006లో సైనిక తిరుగుబాటుతో థాయ్‌లాండ్ మాజీ ప్రధాని థక్సిన్‌ షినవత్ర (Thaksin Shinawatra)పదవి నుంచి వైదొలిగారు. 2008లో రాజకీయ ప్రేరేపిత ఆరోపణలపై ఆయనకు జైలుశిక్ష విధించడంతో థక్సిన్‌ (Thaksin Shinawatra)దేశం విడిచి పారిపోయారు. విదేశాల్లో ఉంటున్న షినవత్ర 15 ఏళ్ల తర్వాత 2023లో థాయ్‌లాండ్‌కు తిరిగొచ్చారు. ఆయన స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత గతంలో నమోదైన కేసులో భాగంగా ఆయనకు సుప్రీంకోర్టు 8 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Thaksin Shinawatra – థాయ్‌ మాజీ ప్రధానికి మరో ఏడాది జైలుశిక్ష

అయితే థక్సిన్‌ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ దేశపు రాజు శిక్షను ఏడాదికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శిక్షను తగ్గించినప్పటికీ వైద్య కారణాలతో థక్సిన్‌ ఒక్కరోజు కూడా జైల్లో శిక్ష అనుభవించకపోవడంతో అక్కడి ప్రజల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి. ఆయన నిజంగానే అనారోగ్యానికి గురయ్యారా లేదా శిక్ష నుంచి తప్పించుకోవడానికి తప్పుడు ఆధారాలు సృష్టించారా..? అనే ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అనుమానాల వేళ అప్పట్లో సరిగ్గా శిక్ష అనుభవించని కారణంగా థక్సిన్‌కు ఏడాదిపాటు జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది. కాగా కాంబోడియా సెనెట్‌ అధ్యక్షుడు హన్‌సేన్‌తో థాయ్‌లాండ్‌ ప్రధాని, థక్సిన్‌ కుమార్తె పేటోంగ్టార్న్‌ షినవత్ర ఫోన్‌లో మాట్లాడటం సంచలనం రేపడంతో ఇటీవల అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను పదవి నుంచి తొలగించింది.

థాయిలాండ్ కొత్త ప్రధాని ఎవరు?

థాయిలాండ్: దేశ కొత్త ప్రధానమంత్రిగా అనుతిన్ చార్న్‌విరాకుల్ నేడు బాధ్యతలు స్వీకరించారు. థాయిలాండ్‌లో, అనుతిన్ చార్న్‌విరాకుల్ ఈరోజు ఆ దేశ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత వారం కోర్టు ఉత్తర్వు ద్వారా తొలగించబడిన శ్రీమతి పేటోంగ్‌టార్న్ షినవత్రా స్థానంలో శ్రీ అనుతిన్ బాధ్యతలు స్వీకరించారు.

తక్సిన్ ప్రస్తుతం ఎక్కడ ?

చివరికి, థాక్సిన్ 22 ఆగస్టు 2023న థాయిలాండ్‌కు తిరిగి వచ్చాడు మరియు వెంటనే అదుపులోకి తీసుకున్నాడు. అతనికి 2024లో పెరోల్ ఇచ్చి క్షమాపణ లభించింది.

ప్రస్తుతం థాయిలాండ్ను ఎవరు నియంత్రిస్తున్నారు?

థాయిలాండ్ రాజు వజిరలాంగ్‌కార్న్ (రామ X) తన తండ్రి భూమిబోల్ అదుల్యదేజ్ (రామ IX) 13 అక్టోబర్ 2016న మరణించినప్పటి నుండి పరిపాలిస్తున్నాడు; డిసెంబర్ 1, 2016 నుండి పరిమిత పాలనను అమలు చేస్తున్నాడు. ఆయన దేశాధినేత, థాయిలాండ్ ప్రివీ కౌన్సిల్ ద్వారా తన విధులకు సహాయం పొందుతాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/parliament-building-on-fire/breaking-news/544010/

Breaking News former Thai PM latest news Telugu News Thai court news Thailand politics Thaksin jail sentence Thaksin Shinawatra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.