📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Thailand ఈ విమానాల్లో ప్రయాణం ఫ్రీ.. పర్యాటకులకు థాయ్‌లాండ్ ఆఫర్‌

Author Icon By Vanipushpa
Updated: August 22, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్(Thailand) ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ దేశంలో పర్యాటక రంగాన్ని, అలాగే కొన్ని ప్రదేశాలను అభివద్ధి చేయడానికి దేశీయ విమాన ప్రయాణాన్ని ఉచితంగా కల్పించనుంది. ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు థాయ్‌లాండ్‌లో ఉన్న పుకెట్, బ్యాంకాక్‌లో ఉన్న ప్రదేశాలను చూడటానికి వెళ్తున్నారని ప్రభుత్వం గ్రహించింది. మిగిలిన ప్రదేశాలు కూడా చూసేలా తమ దేశంలో ఉచిత విమాన ప్రయాణం(Free Flight Travel) చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో “బై ఇంటర్నేషనల్, ఫ్రీ థాయ్‌లాండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్” అనే పథకం పేరుతో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పథకం ద్వారా భారత దేశం నుంచి కానీ వేరే దేశం నుంచి వచ్చే పర్యాటకులు అన్ని ప్రదేశాలను సందర్శిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆఫర్ కింద దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి వన్ వే టికెట్ ధర 1750 బాత్ అవుతుంది. రౌండ్ ట్రిప్స్ (Round Trip) అయితే 3500 బాత్ అవుతుంది. వీటిని ప్రభుత్వమే ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో ఈ బంపర్ ఆఫర్‌పే థాయ్‌లాండ్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Thailand ఈ విమానాల్లో ప్రయాణం ఫ్రీ.. పర్యాటకులకు థాయ్‌లాండ్ ఆఫర్‌

20 కిలోల లగేజీని ఉచితంగా..
ఈ పథకం కింద విదేశీ పర్యాటకులు థాయ్‌లాండ్‌కు స్టాండర్డ్ అంతర్జాతీయ విమాన టిక్కెట్లు కొనుగోలు చేసిన తర్వాత తీసుకోవాలి. అది కూడా ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లు, మల్టీ సిటీ ఆప్షన్స్, ఫ్లైత్రూ సర్వీసెస్, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ ఉచిత ప్రయాణ ఆఫర్‌ ఈజీగా పొందవచ్చు. అయితే ప్రతి పర్యాటకుడు రెండు దేశీయ విమాన టిక్కెట్లను పొందవచ్చు మరియు 20 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ ఆఫర్‌తో దాదాపుగా 2 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులను రప్పించాలనే లక్ష్యంగా థాయ్‌లాండ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం వల్ల థాయ్‌లాండ్ ప్రభుత్వానికి 21.80 బిలియన్ బాత్ వరకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేసింది. దీనివల్ల పర్యాటకులు కొత్త ప్రదేశాలను కూడా చూస్తారని భావిస్తోంది.
ఉపాధి అవకాశాల కోసం ఈ పథకం
ఈ పథకం వల్ల భారతీయులు తక్కువ బడ్జెట్‌లో థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో ఉన్న అన్ని ప్రదేశాలను వీక్షించి రావచ్చు. ఉదాహరణకు, భారతీయ పర్యాటకులు బ్యాంకాక్‌లో దిగి, అక్కడి నుండి చియాంగ్ మై, చియాంగ్ రాయ్ లేదా క్రాబి వంటి ప్రదేశాలకు ఉచిత విమాన ప్రయాణం చేయవచ్చు. దీనివల్ల ఖర్చు తక్కువగా కావడంతో అన్ని ప్రదేశాలను సందర్శిస్తారు.
కోవిడ్ 19 వల్ల థాయ్‌లాండ్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. మళ్లీ తిరిగి పుంజుకోవాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అన్ని ప్రాంతాలను పర్యాటకులు చూస్తారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఇతర చిన్న వ్యాపారాలకు బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

థాయిలాండ్ ఎలా ప్రసిద్ధి చెందింది?
'స్మైల్స్ భూమి' దాని అద్భుతమైన బీచ్‌లు, అద్భుతమైన ఆహారం మరియు అందమైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది, అయితే ఇది దాని బురదమయమైన అండర్‌బెల్లీ మరియు అస్తవ్యస్తమైన రోడ్లకు కూడా ఖ్యాతిని కలిగి ఉంది.
థాయిలాండ్‌లో ఏది బాగా ప్రసిద్ధి చెందింది?
థాయిలాండ్ దాని అద్భుతమైన దేవాలయాలు మరియు గొప్ప బౌద్ధ సంస్కృతి, విభిన్న ద్వీప స్వర్గాలు మరియు అందమైన బీచ్‌లు, ఉత్సాహభరితమైన వీధి ఆహారం మరియు రుచికరమైన వంటకాలు, చతుచక్ వంటి మార్కెట్లలో ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాలు, సాంప్రదాయ థాయ్ మసాజ్‌లు మరియు స్పా ఉత్పత్తులు మరియు సాంగ్‌క్రాన్ వంటి ఉత్సాహభరితమైన పండుగలకు ప్రసిద్ధి చెందింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dk-shivakumar-sings-rss-anthem-in-karnataka-assembly/national/534361/

Free Flights Latest News Breaking News Telugu News Thailand News Thailand Tourism Tourist Promotion Travel Offers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.