Thai soldier killed : బ్యాంకాక్ థాయ్‌లాండ్ కాంబోడియా సరిహద్దులో తాజాగా మరోసారి ఉద్రిక్తత పెరిగింది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో జరిగిన కొత్త ఘర్షణల్లో ఒక థాయ్ సైనికుడు మృతి చెందగా, కనీసం నలుగురు గాయపడినట్లు థాయ్ ఆర్మీ సోమవారం వెల్లడించింది.
ఉబోన్ రాచథానీ ప్రావిన్స్‌లో సోమవారం తెల్లవారుజామున కాంబోడియా దళాలు కాల్పులు ప్రారంభించాయని థాయ్ ఆర్మీ పేర్కొంది. ప్రతిస్పందనగా థాయ్ దళాలు వైమానిక దాడులకు దిగినట్లు ఆర్మీ ప్రతినిధి వింతాయి సువరీ తెలిపారు. కంబోడియా దాడులను అణచివేయడానికి వివిధ ప్రాంతాల్లో ఉన్న సైనిక లక్ష్యాలపై విమానాల ద్వారా దాడులు చేసినట్లు పేర్కొన్నారు.
అయితే, కాంబోడియా ప్రభుత్వం దీనిని ఖండించింది. తమ భూభాగంలోని ప్రేగా విహేర్, ఒడ్డార్ మీన్‌చే ప్రావిన్స్‌ల్లో థాయ్ దళాలు ముందుగా దాడులు చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాలీ సోచెయాటా ఆరోపించారు. తామోన్ థోమ్ ఆలయం సమీపంలో ట్యాంకులతో కాల్పులు జరిపారని ఆమె చెప్పారు.
Read Also: Kavitha: మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు
ఒడ్డార్ మీన్‌చే ప్రాంతంలో గన్‌ఫైర్ తీవ్రత పెరుగుతుందని స్థానిక అధికారులు తెలిపారు. (Thai soldier killed) సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలు భద్రత కోసం పల్లెలు విడిచి వెళ్లిపోతున్నారని కాంబోడియా ప్రతినిధి మెట్ మీస్‌ఫెడియ్ వెల్లడించారు.
తాజా ఘటనల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని థాయ్ వైపు నుంచి దాదాపు 35 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు థాయ్ రెండో ఆర్మీ విభాగం వెల్లడించింది. కాంబోడియా దళాలు పౌర ప్రాంతాల వైపు రాకెట్లను ప్రయోగించాయని థాయ్ ఆర్మీ ఆరోపించినప్పటికీ, ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.
ఈ రెండు దేశాల మధ్య ఈ వేసవిలో ఐదు రోజుల పాటు కొనసాగిన ఘర్షణల్లో 43 మంది మృతి చెందగా, సుమారు మూడు లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. అప్పట్లో అమెరికా, చైనా, మలేషియా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, మళ్లీ ఉద్రిక్తత తెరపైకి వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: