📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: TG: ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కు మోదీని ఆహ్వానించిన రేవంత్

Author Icon By Saritha
Updated: December 1, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025’ (TG) నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.తరలి రండి – ఉజ్వల తెలంగాణలో భాగస్వాములు అవ్వండి అనే నినాదంతో డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి రోజువారీ సమీక్షలు చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,000 మంది ప్రతిష్ఠాత్మక అతిథులు రానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మీడియా & టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యూఏఈ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, గ్లోబల్ స్థాయి సీఈవోలు హాజరుకానున్నారు. తెలంగాణ అభివృద్ధి దిశ, పెట్టుబడులకు అనుకూల విధానాలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే లక్ష్యంతో ఈ సదస్సు రూపొందించారు.

Read also: రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపులు ఎప్పుడు?

Revanth invites Modi to ‘Rising Global Summit’

‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణ

ఈ రెండు(TG) రోజుల సమ్మిట్‌లో భాగంగా, డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ పథక దిశానిర్దేశక పత్రాన్ని విడుదల చేయనున్నారు. టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొనడానికి ఇప్పటికే అంగీకారం తెలిపారు.

ఈ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరి, హెచ్‌డీ కుమారస్వామి వంటి పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, బుల్లెట్ ట్రైన్, మెట్రో విస్తరణ వంటి కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన వినతిపత్రాలు కూడా ఈ సందర్శనలో ప్రధానికి అందించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Global Summit 2025 Hyderabad Events investment summit Latest News in Telugu reventh reddy Telangana Development Telangana news telangana rising summit Tony Blair trump media

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.