Texas Shooting Incident: టెక్సాస్ బార్‌లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!

Read Time:  1 min
Texas Shooting Incident: టెక్సాస్ బార్‌లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!
FONT SIZE
GET APP

టెక్సాస్ (అమెరికా): అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పంజా విసిరింది. టెక్సాస్ స్టేట్ రాజధాని ఆస్టిన్‌లోని ఒక బార్‌లో జరిగిన కాల్పుల(Texas Shooting Incident) ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Texas Shooting Incident: Shooting rampage in Texas bar, three dead!
Texas Shooting Incident: Shooting rampage in Texas bar, three dead!

Read Also: Suriya 45 Update: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టైటిల్ అనౌన్స్మెంట్

ఘటన వివరాలు

ఆస్టిన్ నగరంలోని ఒక రద్దీగా ఉండే బార్‌లోకి ప్రవేశించిన సాయుధుడు ఒక్కసారిగా అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ మెరుపు దాడిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

పోలీసుల ఎదురుకాల్పులు – నిందితుడు హతం

పోలీసులు సాయుధుడిని లొంగిపోవాలని కోరినప్పటికీ, అతడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య నలుగురికి చేరింది. ఈ కాల్పుల్లో మొత్తం 14 మందికి గాయాలయ్యాయి. వారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.