Blackout Challenge Death Texas: సోషల్ మీడియా ఛాలెంజ్‌లు ప్రాణాలకు ఎలా ముప్పుగా మారుతున్నాయో చెప్పే మరో విషాదకర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 9 ఏళ్ల చిన్నారి జాక్‌లిన్ కే బ్లాక్‌వెల్ ‘బ్లాక్ అవుట్’ ఛాలెంజ్ ప్రయత్నించి ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేస్తోంది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన కర్టీస్, వెండీ బ్లాక్‌వెల్ దంపతుల కుమార్తె జాక్‌లిన్ కే బ్లాక్‌వెల్ (9) సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, షార్ట్స్ పట్ల అమితమైన ఆసక్తి చూపించేది. ఈ క్రమంలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.
Read Also: Natanz nuclear facility: నతాంజ్ అణు కేంద్రంపై దాడి.. రేడియేషన్ లీకేజీ జరగలేదు
Blackout Challenge Death Texas: అసలేం జరిగింది?
ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం బ్లాక్‌వెల్ సోషల్ మీడియాలో ‘బ్లాక్ అవుట్’ ఛాలెంజ్ అనే వీడియోను చూసింది. తను చూడడమే కాకుండా తన అమ్మమ్మకు కూడా చూపించింది. అయితే ఆ వీడియోను చూసిన ఆ పెద్దావిడ బయపడింది. అంతేకాక అలాంటి వాటికి జోలికి వెళ్లద్దు అంటూ పాపను హెచ్చరించింది.ఇదిలా ఉండగా ఫిబ్రవరి 3న ఉదయం జాక్‌లిన్ ఆడుకోవటానికి అని చెప్పి ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లింది.
అయితే అలా వెళ్లిన పాప ఎంత సేపటికి ఇంటిలోకి తిరిగిరాకపోవటంతో ఆమె కోసం తల్లి అక్కడికి వెళ్లింది. అమె అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ సమయంలో జాక్‌లిన్ తన గొంతుకు తాడు బిగించుకుని పడిపోయి ఉండడాన్ని గమనించింది.వెంటనే ఆమె పరుగెత్తుకుంటూ బాలిక దగ్గరకు వెళ్లింది. మెడకు ఉన్న తాడును తీసిపడేసి చలనం లేకుండా పడిఉన్న కూతురిని రక్షించుకోవాలనే తాపత్రంతో సీపీఆర్ కూడా చేసింది. అయినా లాభం లేకపోవడంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసింది.

తల్లి ఆవేదన: “పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచండి”
హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితు అక్కడి వైద్యులు జాక్‌లిన్‌ను పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ విషయమై జాక్‌లిన్ తల్లి కర్టీస్ మాట్లాడుతూ.. ‘నేను చాలా భయపడిపోయాను. నేనెప్పుడూ అంత షాకింగ్ సన్నివేశం చూడలేదు. నా కూతురిని అలాంటి పరిస్థితిలో చూస్తాను అనుకోలేదు. తనను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాను.
కానీ, లాభం లేకుండా పోయింది. మీరు కూడా మీ పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచండి. సోషల్ మీడియా అల్గారిథమ్ చాలా దారుణంగా పని చేస్తుందని ఆమె హెచ్చరించారు. వాటిని అలా తయారు చేశారని, పసి పిల్లల ప్రాణాలు పోవడానికి కారణం ముమ్మాటికీ ఆ కంపెనీలే’ అంటూ ఆవేదన వ్యక్తం చేయడం పలువురిని కంటతడి పెట్టించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: