📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Texas: టెక్సస్ వరదలు..ఎటుచూసినా భయానక దృశ్యాలే

Author Icon By Vanipushpa
Updated: July 7, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్సస్‌(Texas)లోని గ్వాడాలుపే నది ఒడ్డున ఉన్న ‘క్యాంప్ మిస్టిక్‌’లోని క్రైస్తవ బాలికల శిబిరం కొన్నిరోజుల కిందటి వరకు నవ్వులు, ప్రార్థనలు, సాహసాలకు కేంద్రంగా ఉండేది. జులై 4న అక్కడ ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈ క్యాంపులోని బాలికలంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో కుండపోత వర్షాల కారణంగా గ్వాడాలుపే నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. 45 నిమిషాల వ్యవధిలోనే 26 అడుగుల ఎత్తుకు ప్రవాహం పెరిగింది. నది ఒడ్డుకు 500 అడుగుల దూరంలో లోతట్టు ప్రాంతాన ఉన్న క్యాబిన్లలో అనేక మంది బాలికలు నిద్ర పోతున్నారు. ఆ క్యాబిన్లలో ఉన్న అనేక బంక్ బెడ్ల మీద ఇప్పుడు మట్టి పేరుకుపోయింది. వేసవి శిబిరం విషాదకరంగా మధ్యలోనే ఆగిపోయింది. శిబిరంలోని పిల్లలు క్యాంప్‌ఫైర్ వేసుకుని బైబిల్ చదవుతూ పాటలు పాడే ప్రాంతమంతా ధ్వంసమైంది.

Texas: టెక్సస్ వరదలు..ఎటుచూసినా భయానక దృశ్యాలే

వారి వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. లోపలున్న వస్తువులన్నీ నీటిలో నానిపోయాయి.
టెక్సస్‌లో వరదల వల్ల ఇప్పటి వరకు 78 మంది మృతి
సెంట్రల్ టెక్సస్‌లో వరదల వల్ల ఇప్పటి వరకు 78 మంది చనిపోయినట్లు నిర్ధరించారు.
అందులో 28 మంది పిల్లలు సహా 68 మంది కెర్ కౌంటీకి చెందిన వారే. ఈ ప్రాంతంలోనే క్యాంప్ మిస్టిక్ ఉంది. చనిపోయిన వారిలో కొంతమంది యువతులతో పాటు క్యాంపుకు దీర్ఘకాలంగా డైరెక్టర్‌గా ఉన్న రిచర్డ్ డిక్ ఈస్ట్ ల్యాండ్ ఉన్నారు. క్యాంపులో పది మంది బాలికలు, ఒక కౌన్సెలర్ ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు.
నిద్ర లేచేసరికి..
13 ఏళ్ల స్టెల్లా థాంప్సన్ ఉండే క్యాబిన్ చాలా ఎత్తులో ఉంది. శుక్రవారం ఉదయం కురుస్తున్న వర్షాలకు ఆమె నిద్రలేచారు. పైన హెలికాప్టర్ల శబ్దం వినిపించడంతో ఏదో జరిగిందని ఆమె గ్రహించారు. గ్వాడాలుపే నది పక్కన ఉన్న క్యాంపులోకి వరద నీరు వచ్చిందని ఆమె క్యాబిన్‌లోని మిగతా బాలికలకు తెలిసింది. “మాకు ఆ వార్త తెలిసిన వెంటనే అందరం ప్రార్థనలు చేశాం” అని స్టెల్లా డాలస్ ఎన్‌బీఎస్ వార్తాసంస్థ(NBS News Agency) ప్రతినిధితో చెప్పారు. “మేమందరం చాలా ఆందోళన చెందాం. నిజంగానే భయపడ్డాం. అయితే అది మా గురించి కాదు. అవతలి వైపు ఉన్న వారి గురించి” అని ఆమె చెప్పారు.

ప్రవాహంలో కొట్టుకుపోయాయి
మిలటరీ ట్రక్కుల్లో తమను తరలిస్తున్నప్పుడు తాను చూసిన ‘భయానక’ దృశ్యాలను స్టెల్లా వివరించారు. “కయాక్‌లు(చిన్న పడవలు) ప్రవాహంలో కొట్టుకుపోయి చెట్లలో చిక్కుకున్నాయి. సహాయ బృందాలు అమ్మాయిలను నీటి నుంచి బయటకు లాగుతున్నాయి’ అని చెప్పారు. “పెద్ద పెద్ద చెట్లు వేళ్లతో సహా నేలను చీల్చుకుని బయటకు వచ్చాయి. అది క్యాంప్ మిస్టిక్ లాగా ఏమాత్రం అనిపించలేదు” అన్నారు.
నది ఒడ్డున ఎత్తైన ప్రదేశంలో భద్రత
‘కొండల పైభాగంలో ఉన్న మా క్యాబిన్లు కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి’ అని క్యాంప్ మిస్టిక్ పక్కనే ఎత్తైన ప్రాంతంలో ఉంటున్న కేథరిన్ సోమర్ విల్లే ‘ఫాక్స్‌ న్యూస్‌’తో చెప్పారు. “మీరంతా ఈ విధ్వంసాన్ని చూశారు. ఇలా జరుగుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు” అని ఆమె చెప్పారు. తన క్యాంపులో ఉన్నవారంతా భద్రంగా ఉన్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆమె తెలిపారు.
ఒక క్యాంపులో మెడ వరకు నీరు రావడంతో, అందులో ఉన్న బాలికలు ఈదుకుంటూ బయటకు వెళ్లేందుకు వీలుగా ఆ క్యాంపు కౌన్సెలర్ కిటికీని బద్దలు కొట్టారని టెక్సస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ పాట్రిక్ చెప్పారు. “ఆ చిన్న పిల్లలు పది, పదిహేను నిమిషాలు ఈదుతూనే ఉన్నారు” అని ఆయన ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ వీకెండ్ టెలివిజన్ కార్యక్రమంలో చెప్పారు. “చీకట్లో వేగంగా ప్రవహించే నీటిలో మీ వైపు చెట్లు, రాళ్లు దూసుకు వస్తాయని మీరు ఉహించగలరా? ఆ ప్రవాహం మిమ్మల్ని భూమి మీద ఎక్కడకో చేరుస్తుంది” అని పాట్రిక్ ఆ కార్యక్రమంలో చెప్పారు. ప్రస్తుతం క్యాంప్ ప్రవేశ ద్వారాన్ని పోలీసులు మూసివేశారు. మరింత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిస్తే సహాయ కార్యక్రమాలకు మరిన్ని సమస్యలు ఏర్పడతాయి. వరదలు వచ్చిన మూడు రోజుల తర్వాత, ఆశలు సన్నగిల్లుతున్నాయి .

సముద్ర తీరప్రాంతంలోని వరదలు

సముద్రంలో అధిక ఆటుపోట్లు, తుఫాను రావడం వల్ల తీరప్రాంతాలు నీటితో నిండిపోతాయి. సునామిల వల్ల నీటిమట్టం పెరగడంతో తీరప్రాంతాలలో వరదలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో తుఫాను ద్వారా 20 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ అడుగుల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉంది.

బురదతో కూడిన వరదలు

నీటి ప్రవాహం వల్ల పంట భూములలో బురదతో కూడిన వరదలు వస్తాయి. పంట భూములలో వేగంగా ప్రవహించే అదనపు నీరు ఒకేచోట చేరడం వల్ల ఈ వరదలు వచ్చే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

Breaking News extreme weather events flood scenes Texas latest news storm aftermath USA Telugu News Texas emergency alert Texas flood video Texas floods Texas rain damage US flooding 2025 US nat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.