📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Tesla: ఢిల్లీ షోరూమ్ లో టెస్లా ప్రారంభం

Author Icon By Vanipushpa
Updated: August 11, 2025 • 2:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా(Telsa), భారత్‌(India)లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన నెల రోజుల లోపే, సోమవారం దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో తన రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. ఢిల్లీ(Delhi)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ఈ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది.
‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’గా ..
ఈ షోరూమ్‌ను కేవలం కార్ల విక్రయ కేంద్రంగా కాకుండా, ఒక ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’గా తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చే కస్టమర్లు టెస్లా ‘మోడల్ వై’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దగ్గరగా పరిశీలించవచ్చు. కారు కొనుగోలు ప్రక్రియ, చార్జింగ్ ఆప్షన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా సహా చుట్టుపక్కల ప్రాంతాల కస్టమర్లకు ఈ కేంద్రం సేవలందించనుంది. పండుగల సీజన్‌కు ముందే భారత ప్రీమియం ఈవీ మార్కెట్లో బలమైన ముద్ర వేయాలనే వ్యూహంతో టెస్లా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Tesla: ఢిల్లీ షోరూమ్ లో టెస్లా ప్రారంభం

భారత మార్కెట్లో టెస్లా ‘మోడల్ వై’ను మాత్రమే విక్రయిస్తోంది
ప్రస్తుతం భారత మార్కెట్లో టెస్లా ‘మోడల్ వై’ను మాత్రమే విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ రియర్-వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు కాగా, లాంగ్ రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది.

భారత్‌లో స్థానిక తయారీ యూనిట్ ఏర్పాటు

పనితీరు విషయానికొస్తే, స్టాండర్డ్ మోడల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని, లాంగ్ రేంజ్ వేరియంట్ 622 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. రెండు వేరియంట్ల గరిష్ఠ వేగం గంటకు 201 కిలోమీటర్లు. ఫాస్ట్ చార్జర్‌తో కేవలం 15 నిమిషాల్లోనే స్టాండర్డ్ మోడల్ 238 కిలోమీటర్లు, లాంగ్ రేంజ్ మోడల్ 267 కిలోమీటర్ల రేంజ్‌ను తిరిగి పొందగలవని టెస్లా వివరించింది. అయితే, భారత్‌లో స్థానిక తయారీ యూనిట్ ఏర్పాటు లేదా ఇతర మోడళ్ల విడుదలపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

టెస్లా కంపెనీ అంటే ఏమిటి?
టెస్లా కంపెనీ అనేది టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఉన్న ఒక కంపెనీ, ఇది ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. దీనిని 2003లో మార్టిన్ ఎబెర్‌హార్డ్ మరియు డిలన్ స్టాట్ ప్రారంభించారు. ఎబెర్‌హార్డ్ ఇకపై అక్కడ పనిచేయడం లేదు. నేడు, ఎలోన్ మస్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).

టెస్లా కంపెనీ భారతదేశంలో అందుబాటులో ఉందా?
ఎలోన్ మస్క్ యొక్క EV దిగ్గజం ముంబైలో దాని మోడల్ Yని ప్రారంభించింది, కానీ దాని $70,000 ధర దాని అతిపెద్ద వేగ బంప్ కావచ్చు. న్యూఢిల్లీ, భారతదేశం - టెస్లా తన మోడల్ Yని ప్రారంభించడంతో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద కార్ మార్కెట్ అయిన భారతదేశంలో చివరకు ప్రయాణిస్తోంది. ఈ విడుదల దశాబ్దం పాటు సాగిన, తలక్రిందులుగా సాగిన ప్రయాణానికి పరాకాష్టను సూచిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/a-key-step-forward-in-maruti-car-safety/business/528600/

delhi Electric Vehicles EV Market India News Latest News Breaking News Showroom Launch Telugu News Tesla

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.