📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telsa: భారత్‌లో టెస్లా వై మోడల్ కారుపై రూ.29 లక్షల పన్ను

Author Icon By Vanipushpa
Updated: July 16, 2025 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా ఈవీ(America EV) దిగ్గజం టెస్లా(Telsa) భారత్(India) లోకి తన వై మోడల్ ఈవీ కారు(Y model EV Car) ద్వారా గ్రాండ్(Grand) గా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. టెస్లా ముంబైలో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. తాజాగా ఈ కారుకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో బుకింగ్ చేసుకున్న వారికి వై మోడల్ కారు డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ధరపై అందరూ పెదవి విరుస్తున్నారు. దేశంలో రూ. 61 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ఈ కారు భారత విపణిలోకి ప్రవేశించింది. అయితే అమెరికాలో దీని ధర 37,490 డాలర్లు(సుమారు రూ. 32 లక్షలు)కి అందుబాటులో ఉంది. ఈ ధరల్లోని భారీ వ్యత్యాసంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Telsa: భారత్‌లో టెస్లా వై మోడల్ కారుపై రూ.29 లక్షల పన్ను

అమెరికాలో ఈ కారు ధర రూ. 33 లక్షలు
టెస్లా వెబ్‌సైట్ ప్రకారం.. లో ఒక మోడల్ ధర రూ. 59.89 లక్షలు కాగా మరొక మోడల్ ధర రూ. 67.89 లక్షలు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ ధర చాలా ఎక్కువ. అమెరికాలో ఈ కారు ధర దాదాపు రూ. 33 లక్షలు. టెస్లా ఖరీదైన కారుపై చాలా మంది కోపంగా ఉన్నారు. ఈ కారుపై విధించిన పన్నుపై వినియోగదారులు మండిపడుతున్నారు. కారు ధరలో దాదాపు సగం పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు సోషల్ మీడియాలో టెస్లా పేరును TAX-LA అని పిలుస్తున్నారు.

చైనాలో తయారైన కార్లను భారతదేశంలో విక్రయం

వాస్తవానికి చైనాలో పూర్తిగా తయారైన ఈ కారును భారతదేశానికి తీసుకురావడం..అలాగే కొన్ని లగ్జరీ వస్తువులపై పన్ను విధించడం వల్ల దీని ధర చాలా ఎక్కువగా ఉంది. టెస్లా ప్రస్తుతం చైనాలో తయారైన కార్లను భారతదేశంలో విక్రయిస్తోంది. అందువల్ల దిగుమతి సుంకం భారీ స్థాయిలో ఉంది.దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఓ నెటిజన్ మాట్లాడుతూ.. ‘మీరు భారతదేశంలో Tesla ModelYని కొనుగోలు చేస్తే.. మీరు కంపెనీకి దాదాపు రూ. 33 లక్షలు చెల్లిస్తే.. ప్రభుత్వానికి రూ. 28 లక్షలు పన్నుగా చెల్లిస్తారు.

Tesla Model Y ధర రెట్టింపు ఎందుకంటే..

దిగుమతి సుంకం లేదా ఇతర పన్నుల కారణంగా Tesla Model Y ధర రెట్టింపు అయింది. రోడ్డు పన్ను, బీమా, GST మొదలైన వాటిని విడిగా వసూలు చేస్తారు. Tesla భారతదేశంలో ఉత్పత్తిని లేదా కనీసం అసెంబ్లీని ప్రారంభించకపోతే.. అది విజయవంతం కాదని మరొక నెటిజన్ తెలిపారు. కాగా టెస్లా ప్రస్తుతం భారతదేశంలో ప్రస్తుతం తన ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం లేదు. చైనాలో తయారైన కార్లను ఇండియాకు తీసుకువచ్చి విక్రయిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ కారుపై చాలా పన్ను విధించబడుతుంది.

అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సిందే
కంపెనీ దాని వెబ్‌సైట్‌లో ఈ కార్ల మీద ఫైనాన్సింగ్, EMI లేదా లీజు పథకం గురించి ఎటువంటి సమాచారాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కస్టమర్ ఈ కారును సొంతం చేసుకోవాలనుbకుంటే పూర్తి మొత్తం నగదు చెల్లించాలని కంపెనీ వెబ్ సైట్ ని బట్టి తెలుస్తోంది.అయితే భారతదేశం వంటి మధ్యతరగతి మార్కెట్‌లో.. వినియోగదారులు వాయిదాలలో కొనడానికి ఇష్టపడతారు. టెస్లా కంపెనీ నగదు ఎంపికతో మాత్రమే ప్రారంభించడం పరిమిత వ్యూహంగా పరిగణించబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also : Chandrababu : ముగిసిన అమిత్ షా, చంద్రబాబు మీటింగ్

#telugu News Automobile News Electric Vehicles India EV Policy Import Tax India Luxury Car Tax Model Y Pricing Tesla India Tesla Launch India Tesla Model Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.