Tesla india offer : భారత్‌లో అమ్మకాలను పెంచుకునేందుకు అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం Tesla Inc. కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. అధిక ధరల కారణంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో కంపెనీ ప్రత్యేక ప్రణాళికలను వెల్లడించింది.
కంపెనీ ప్రధాన మోడల్ అయిన Tesla Model Yపై ప్రత్యేక సదుపాయాలు అందిస్తోంది. రూ.6 లక్షల డౌన్ పేమెంట్‌తో నెలకు సుమారు రూ.49 వేల ఈఎంఐతో కారు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. అంతేకాకుండా పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును మార్పిడి చేసుకునే వారికి రూ.3 లక్షల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తోంది. దీంతో ప్రీమియం ఈవీ కార్లను మధ్యతరగతి వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని టెస్లా భావిస్తోంది.
Read Also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్
టెస్లా వాదన ప్రకారం, ఎలక్ట్రిక్ కారు వాడకం వల్ల ఇంధన, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. నెలకు సుమారు రూ.20 వేల వరకు ఆదా అవుతుందని, అందువల్ల ఈఎంఐ భారమూ తక్కువగా అనిపిస్తుందని కంపెనీ చెబుతోంది.
గత ఏడాది భారత్‌లో ప్రవేశించిన టెస్లాకు ప్రారంభంలో మంచి స్పందన లభించినప్పటికీ, అధిక ధరల కారణంగా అమ్మకాలు ఆశించిన స్థాయిలో సాగలేదు. ఏడాది మొత్తానికి కేవలం కొన్ని వందల కార్లే విక్రయించగలిగింది. ఇదే సమయంలో ఇతర ఈవీ బ్రాండ్లు పోటీ పెంచడంతో టెస్లా కొత్త ఆఫర్లతో మార్కెట్‌ను మళ్లీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: