సోమాలియా రాజధానిలోని అత్యంత భద్రత కలిగిన ఓ కారాగారంపై దాడి సందర్భంగా ఏడుగురు అల్-షాబాద్ మిలిటెంట్లను (Terrorist) చంపేసినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. శనివారం సాయంత్రం మొగదిషు ప్రాంతంలోని అల్-షాబాద్ మిలిటెంట్లు బందీలుగా ఉండే గోడ్కా జిలికోవ్ నిర్బంధ కేంద్రం నుంచి భారీ ఎత్తున పేలుడు, గన్ ఫైర్ శబ్దాలు వినిపించాయి. ఈ కేంద్రం నుంచి ‘అందరు ముస్లిం ఖైదీలని’ తాము విడుదల చేసినట్లు అల్-షాబాద్(Al-Shabad) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నట్లు కూడా పేర్కొంది. సైనికుల దుస్తులు ధరించిన మిలిటెంట్లు (Terrorist) కారాగారంలోని ప్రవేశించారని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీ సోనా లైవ్ ఆదివారం తెలిపింది.
Read Also: Rabies:రేబిస్ వ్యాధితో మరణించిన బాలుడు
స్పష్టతలేని భద్రతా బలగాల మృతుల సంఖ్య
ఈ ఘటనలో భద్రతా బలగాలకు చెందినవారు ఎంతమంది మరణించారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదుగానీ, ‘నేలకొరిగిన వీరుల’ కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొంది. అదే సమయంలో అల్-షాబాద్ సంస్థ కూడా ఎంతమంది తమ అనుచరులు మరణించారనే విషయాన్ని చెప్పలేదు.
పెద్ద ఎదురుదెబ్బే
గోడ్కా జిలికోవ్ కేంద్రం మొగదిషు నగరం మధ్యలో సోమాలియా అధ్యక్ష భవనం ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. దీన్ని సోమాలియా నేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ (నిషా) పర్యవేక్షిస్తుంది. ఇక్కడ అల్-షాబాద్ మిలిటెంట్లతో పాటు, హై-ప్రొఫైల్ ఖైదీలను నిర్బంధంలో ఉంచుతారు. నిర్బంధ కేంద్రంపై మిలిటెంట్లు జరిపిన ఈ దాడి నిసాకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఈ కేంద్రంలో ఉగ్రవాదులు ఎలా ప్రవేశించగలిగారనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్-ఖైదాకు అల్-షాబాద్ అనుబంధ సంస్థ. దాదాపు 20 ఏళ్లుగా ఈ సంస్థ సోమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు కార్యకలాపాలకు పాల్పడుతోంది. మొగదిషులో చాలా ఏళ్లుగా మూసి ఉన్న కీలకమైన రోడ్లను శనివారం ఈ దాడి జరగడానికి కొన్ని గంటలముందు ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.
ఈ దాడి ఎక్కడ జరిగింది?
సోమాలియా రాజధాని మొగదిషులోని గోడ్కా జిలికోవ్ నిర్బంధ కేంద్రం వద్ద ఈ దాడి జరిగింది.
దాడి చేసిన వారు ఎవరు?
అల్-షాబాద్ మిలిటెంట్లు సైనికుల దుస్తులు ధరించి ఈ దాడి జరిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read epaper: https://epaper.vaartha.com/
Read Also: