📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News: Terrorist Ahmed: ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో దొరికిన మరిన్ని విషపదార్థాలు

Author Icon By Sushmitha
Updated: November 13, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారీగా ప్రాణనష్టానికి ప్రణాళిక ఆపరేషన్ సిందూర్ లో ఘోరంగా అపజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ భారతదేశంలో మరింత కసిని పెంచుకున్నట్లుగా ఉంది. యుద్ధంలో తోకముడిచిన పాక్ అడ్డదారుల్లో అమాయక భారతీయు ప్రాణాలను తీసేందుకు భారీ స్కెచ్ ను వేసింది. ఇందులో భాగమే అహ్మద్ మొహియుద్దీన్(Terrorist Ahmed) కుట్ర. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఈ ఉగ్రవాది మూడురోజుల క్రితం పట్టుబడ్డాడు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ పోలీసులు ఇతనిని మూడురోజుల క్రితం అరెస్టు చేశారు. అహ్మద్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని పోలీసు విచారణలో తేలింది. రాజేంద్రనగర్ సర్కిల్ ఫోర్ట్ కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆ తర్వాత ఆన్ లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తూ ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. 

Read Also: Jaish-e-Mohammed: బాబోయ్.. డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్.

ఈ క్రమంలో పాకిస్తానీ హ్యాండర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన జీవ విషాల్లో రిసిన్ ఒకటి. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. దీనిని ఎందులో కలిపినా ఎవరూ గుర్తుపట్టలేరు. చివరకు నీళ్లలో కలిపినా కూడా తెలియదు. అందుకే ప్రజలను చంపేందుకు దీనిని ఎంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ పాయిజన్ ను దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో కలిపి ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు డాక్టర్ సయ్యద్ మొహయుద్దీన్. విషాన్ని ఇవ్వడం ద్వారా దేశంలో వేలాదిమంది మరణించేలా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు పోలసులు చెబుతున్నారు.

Terrorist Ahmed

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న తనిఖీలు

తాజాగా మరోసారి గుజరాత్(Gujarat) యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరోసారి తనిఖీలను చేపట్టింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్ లలో సోదాలు చేసింది. రాజేంద్రనగర్ లోని పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు స్పెషల్ ఎటిఎస్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఇందులో ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో గంటన్నరకు పైగా సోదాలు చేసింది. వీటిల్లో రెసిన్ చేసే యంత్రాలు, అది ఎలా తయారు చేయాలో తెలిపే బుక్స్ తో పాటూ భారీగా రైసిన్ విషపదార్థం తయారీకి ఉపయోగించిన ముడిపద్ధాలు పట్టుబడ్డాయి. వీటన్నింటినీ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. అలాగే మరోవైపు ఏపీలో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు చేసేందుకు సన్నాహాలుచేస్తోంది. గుంటూరులో ముంబై ఏటీఎస్ దాడులు చేస్తోంది. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది.

బాబోయ్ చాలా డేంజర్ రిసీన్ పాయిజన్

సయ్యద్ నుంచి రెండు గ్లోక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్టిడ్జ్ లు, నాలుగు లీటర్ల కాస్టర్ అయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ పేర్కొంది. అవి కాకుండా మూడు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ అమాయక ప్రజల ప్రాణాలు తీయడానికి వాడాలనుకున్న ఆయుధం రిసీన్ పాయిజన్.(Ricin poison) ఇది అత్యంత విషపూరితమైన రసాయనం. ఇది మానవుని శరీరంలోకి చిన్న మొత్తంలో వెళ్లినా కూడా హాని చేస్తుంది. శరీర అవయవాలు దెబ్బతినడం, ప్రాణాలు పోవడం జరుగుతుంది. దీనికి రంగు, రుచి, వాసన ఉండదు. చివరికి మంచి నీళ్లల్లో కలిపినా కూడా కనుక్కోలేరు. అందుకే ఉగ్రవాదులు దీన్ని టార్గెట్ గా ఎంచుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Ahmed Chemical discovery Crime Investigation Google News in Telugu Latest News in Telugu Police seizure Telugu News Today Terror plot investigation Terrorist Arrest Toxic substances

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.