📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు

War: సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు

Author Icon By Vanipushpa
Updated: January 3, 2026 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో రెండు శక్తిమంతమైన దేశాలైన సౌదీ అరేబియా(Saudi Arabia), యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)(UAE) మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. యెమెన్‌లో తాజా ఘర్షణలే దీనికి కారణం. యెమెన్‌ లో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలు చెరోవర్గానికి మద్ధతునివ్వడంతో రెండు రాజ్యాల మధ్య అంతర్యద్ధానికి దారితీస్తోంది. ఒకపుడు కలిసి నడిచిన రెండు దేశాలు ఇలా ఘర్షణకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

ఇంధన వనరులు అధికంగా ఉన్న భూభాగాల ఆక్రమణ

2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో కీలక సనా నగరాన్ని హూతీ తిరుగుబాటుదారులు ఆక్రమించడమే కాకుండా.. దేశంలోని ఉత్తర భాగాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఇక దక్షిణ, తూర్పు యెమెన్‌లను అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్‌ ప్రభుత్వం (ఐఆర్‌జీ) పాలిస్తోంది. ఆ పాలక మండలిలో కీలక భాగస్వామి అయిన సదరన్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌(ఎస్టీసీ) స్వతంత్ర దక్షిణ యెమెన్‌ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదలడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డిసెంబరు నుంచి ఎస్టీసీ కీలక ప్రాంతాలను ఆక్రమించడం మొదలుపెట్టింది. ఆ నెల రెండో వారంలోనే హద్రమౌత్, అల్‌-మరాహ్‌ సహా పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. ఇంధన వనరులు అధికంగా ఉన్న ఈ భూభాగాలను ఆక్రమించడంతో ఒక్కసారిగా యెమెన్‌లో అలజడి చెలరేగింది.

Read Also: Cigarette price: భారీగా పెరగనున్న ధరలు.. ఒక్కో సిగరెట్ ఎంతంటే?

War: సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు

ఎస్టీసీ దాడులతో హూతీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం

ఇక్కడే అసలు వైరం ప్రారంభమైంది. యెమెన్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతిస్తుండగా, దక్షిణ యెమెన్‌ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్టీసీకి యూఏఈ అండగా నిలబటడం రెండు దేశాల మధ్య ఘర్షణలకు కారణమైంది. వాస్తవానికి హూతీలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులన్నింటిని ఏకం చేసింది సౌదీ, యూఏఈలే కావడం గమనార్హం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎస్టీసీకి యూఏఈ అండగా నిలిచింది. మరోవైపు యెమెన్‌ సమైక్యంగా ఉండాలన్నది సౌదీ ఉద్దేశం. ఎస్టీసీ దాడులతో హూతీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలహీనమవుతుందని చెబుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Arab Nations diplomatic conflict Geopolitical Issues Middle East Politics Saudi Arabia Saudi Arabia news Saudi-UAE relations Telugu News Paper Telugu News Today UAE news UAE tensions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.