📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

China: వెలుగులోకి వేయి టన్నుల బంగారు నిక్షేపాల గని

Author Icon By Vanipushpa
Updated: January 26, 2026 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, భారీ బంగారు నిక్షేపాల గనిని కనుగొంది. చైనా(China)లోని మధ్య భాగంలో గల హునాన్ ప్రావిన్స్‌లో ఈ అత్యంత విలువైన ఖనిజ నిక్షేపం ఉన్నట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించింది. ఈ Gold సంపద చైనా ఆర్థిక వ్యవస్థతో పాటు హైటెక్ తయారీ రంగాలకు కీలకమైన బంగారం వంటి వనరుపై దేశానికి మరింత నియంత్రణను తీసుకురావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిక్షేపం ఉన్న ప్రాంతం, అక్కడి భూగర్భ నిర్మాణం, ఖనిజ కూర్పు అసాధారణంగా అధిక విలువ కలిగిన ఆస్తిని సూచిస్తున్నాయి. విదేశీ అస్థిరతల ప్రభావం తగ్గించడంతో పాటు, దేశీయ ఖనిజ ఉత్పత్తిని బలోపేతం చేయాలనే బీజింగ్ వ్యూహంలో భాగంగానే ఈ ఆవిష్కరణ చోటు చేసుకుందని తెలుస్తోంది.

Read Also: Secrets : అమెరికాకు చైనా అణు రహస్యాలు లీక్?

China: వెలుగులోకి వేయి టన్నుల బంగారు నిక్షేపాల గని

ఈ ప్రదేశంలో అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. అదనపు వనరుల మ్యాపింగ్, భూగర్భ పరిశోధనలు 2026 వరకు కొనసాగనున్నాయి. హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్ కౌంటీలో ఉన్న వాంగు బంగారు క్షేత్రంలో 1,000 మెట్రిక్ టన్నులకు పైగా బంగారం ఉన్నట్లు హునాన్ జియోలాజికల్ బ్యూరో అధికారులు నవంబర్ 2025లో ధృవీకరించారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ బంగారం విలువ సుమారు 83 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఈ నిక్షేపంలో ఇప్పటివరకు ధృవీకరించబడిన భాగం సుమారు 2 వేల మీటర్ల లోతులో ఉంది. ఇందులో 40 వేర్వేరు Gold సిరలలో దాదాపు 300 టన్నుల కొలిచిన నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇక్కడి ధాతువు నాణ్యత విశేషంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రయోగశాల పరీక్షల ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో టన్నుకు 138 గ్రాముల వరకు బంగారం గ్రేడ్ ఉన్నట్లు గుర్తించారు.

ఆసియా మార్కెట్లలో రికార్డు స్థాయి

ఇప్పటివరకు 65 కిలోమీటర్లకు పైగా అన్వేషణాత్మక డ్రిల్లింగ్ నిర్వహించగా.. సేకరించిన కోర్ నమూనాల్లో అనేక మండలాల్లో బంగారం ఉన్నట్లు తేలింది .డ్రిల్లింగ్ ఫలితాలు ఈ నిక్షేపం ప్రస్తుతం మ్యాప్ చేసిన సరిహద్దులను మించి విస్తరించే అవకాశముందని సూచిస్తున్నాయి. ఈ మొత్తం అన్వేషణ పనులు 2024లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ యాజమాన్య సంస్థ హునాన్ మినరల్ రిసోర్సెస్ గ్రూప్ పర్యవేక్షణలో సాగుతున్నాయి. చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. ఆసియా మార్కెట్లలో రికార్డు స్థాయిని తాకిన పసిడి రేట్లు.. ఇటీవల Nature Geoscience జర్నల్‌లో ప్రచురితమైన ఒక పీర్-రివ్యూడ్ అధ్యయనం… వాంగు నిక్షేపం లాంటి హై-గ్రేడ్ బంగారు నిల్వలు ఎలా ఏర్పడతాయన్నదానిపై కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. టెక్టోనిక్ ఒత్తిడికి గురైన క్వార్ట్జ్ అధికంగా ఉన్న రాళ్లు పైజోఎలెక్ట్రిక్ ఛార్జ్‌లను ఉత్పత్తి చేసి.. చుట్టుపక్కల ఉన్న హైడ్రోథర్మల్ ద్రవాల నుంచి బంగారం వేగంగా అవక్షేపించడానికి కారణమవుతాయని ఈ అధ్యయనం చెబుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

economic impact gold mine discovery Gold prices massive gold reserves Mineral Resources Mining news Natural resources Telugu News online Telugu News Today ten thousand tons gold

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.