📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Zaki Shalom-మోదీ పాలనపై ఇజ్రాయెల్ ప్రశంసల జల్లులు

Author Icon By Sushmitha
Updated: September 8, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Zaki Shalom: అంతర్జాతీయ సంబంధాలలో ‘దేశ గౌరవాన్ని’ ఒక వ్యూహాత్మక ఆస్తిగా ఎలా కాపాడుకోవాలో భారత్ నుండి ఇజ్రాయెల్(Israel) నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ రక్షణ రంగ నిపుణుడు జకి షలోమ్‌ అభిప్రాయపడ్డారు. మిస్‌గవ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ సెక్యూరిటీలో సీనియర్‌ ఫెలోగా పనిచేస్తున్న ఆయన, ‘జెరూసలెం పోస్ట్‌’కు రాసిన ఒక వ్యాసంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు.

ప్రధాని మోదీ దృఢమైన వైఖరి

పాకిస్థాన్‌తో ఘర్షణలు, అమెరికా విధించిన టారిఫ్‌లు వంటి క్లిష్ట సమయాల్లో ప్రధాని మోదీ దృఢమైన వైఖరిని ప్రదర్శించారని షలోమ్‌ గుర్తుచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను కూడా మాట్లాడేందుకు నిరాకరించడం ద్వారా, తన దేశ గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే బలమైన సందేశాన్ని మోదీ పంపారని ఆయన వివరించారు. “దేశ గౌరవం అనేది కేవలం విలాసవంతమైన విషయం కాదు, అదొక కీలకమైన వ్యూహాత్మక ఆస్తి. మోదీ చర్యలు కఠినంగా అనిపించినా, భారత్‌ను తక్కువగా చూడటాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు” అని షలోమ్‌ తన వ్యాసంలో పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌కు షలోమ్ సూచనలు

మరోవైపు, ఖాన్ యూనిస్‌లోని(United States) నాస్సెర్ ఆసుపత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్ వైఖరి గందరగోళంగా, ఆత్రుతతో కూడుకున్నదిగా ఉందని షలోమ్‌ విమర్శించారు. ఇజ్రాయెల్ స్పందన కారణంగా అమాయకులను చంపామన్న సంకేతాలు ప్రపంచానికి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్రదర్శిస్తున్న నిబద్ధత, స్పష్టత ఇజ్రాయెల్‌కు ఆదర్శం కావాలని షలోమ్‌ సూచించారు.

జకి షలోమ్ ఎవరు?

జకి షలోమ్ ఒక ఇజ్రాయెల్‌ రక్షణ రంగ నిపుణుడు, మిస్‌గవ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ సెక్యూరిటీలో సీనియర్‌ ఫెలోగా పనిచేస్తున్నారు.

ప్రధాని మోదీని ఆయన ఎందుకు ప్రశంసించారు?

అంతర్జాతీయ సంబంధాల్లో దేశ గౌరవానికి మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను, ఆయన అనుసరిస్తున్న దృఢమైన విదేశాంగ విధానాన్ని షలోమ్‌ ప్రశంసించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-ktr-ktr-says-no-reaction-on-kavitha/telangana/543392/

Foreign Policy Google News in Telugu india israel Latest News in Telugu Narendra Modi national honor Telugu News Today Zakie Shalom

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.