📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu news: War-ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపుకు సహకస్తాం: భారత రాయబారి

Author Icon By Pooja
Updated: September 5, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

War-మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) యుద్ధంపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే దౌత్యమార్గమే ప్రధాన పరిష్కారం అని, యుద్ధం త్వరగా ముగింపు పలకడానికి అవసరమైన అన్ని దౌత్య ప్రయత్నాలకు భారత్ సహకరించడానికి సిద్ధంగా ఉందని ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి పి.హరిశ్ ప్రకటించారు.

యుద్ధంపై భారత్ కూడా ఆందోళన

ఐక్యరాజ్యసమితి జనరల్ సమావేశంలో ‘ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగ పరిస్థితిపై జరిగిన చర్చల్లో రాయబారి హరిశ్ మాట్లాడుతూ ఉక్రెయిన్ పరిస్థితిపై భారత్ నిరంతరం ఆందోళన చెందుతోందని చెప్పారు. అమాయకుల ప్రాణనష్టం అసహనీయమైనదని అభిప్రాయపడ్డారు. యుద్ధభూమిలో ఎలాంటి పరిష్కారం దొరకదన్నారు. ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగియడం అందరికీ ప్రయోజనకరమన్నారు. ఇదే విషయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అనేకసార్లు చెప్పినట్లు, ‘ఇది యుద్ధం చేసే యుగం కాదు’ అని గుర్తు చేశారు.

పుతిన్-జెలెన్ స్కీలతో మాట్లాడుతున్న మోదీ

ప్రధాని మోదీ నిరంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ, యూరప్ నాయకత్వంతో టచ్ లో ఉన్నారని, వారితో మాట్లాడుతున్నారని హరీశ్ చెప్పారు. ఈ దౌత్య ప్రయత్నాలన్నీ ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు తెచ్చే దిశగా ఆశలు కలిగిస్తున్నాయన్నారు. ఉక్రెయిన్ లోని పలు గ్రామాలను రష్యా ఇప్పటికే తన ఆధీనంలోకి తెచ్చుకుంది. యుద్ధం వల్ల ఇప్పటికే రెండు దేశాలతో పాటు ప్రపంచదేశాలపై ప్రత్యక్ష పరోక్ష నష్ట ప్రభావం చూపుతూనే ఉంది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో జైశంకర్(Jaishankar) సంభాషణలుభారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఉక్రెయిన్ విదేశాంత మంత్రి ఆండ్రి సిబిహా తో ఫోన్లో మాట్లాడారు. యుద్ధానికి త్వరగా ముగింపు అవసరమని అందుకు భారత్ మద్దతు తెలిపినట్లు ఆండ్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారం అంశాలు కూడా ఇరువురూ చర్చించుకున్నారు. భారత్ మద్దతు తమకు ఎంతో ముఖ్యమైనదన్నారు. అంతర్జాతీయ శాంతి ప్రయత్నాల్లో భారత్ నుంచి చురుకైన సహకారం ఆశిస్తున్నామన్నారు.

భారత్ ఈ యుద్ధం వల్ల ప్రపంచానికి ఎదురవుతున్న సమస్యలపై ఏమని వ్యాఖ్యానించింది?

యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడం, ఆహార సరఫరాకు అంతరాయం కలగడం వంటి పరిణామాలు ప్రపంచానికి, ముఖ్యంగా “గ్లోబల్ సౌత్” అని పిలువబడే అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీవ్రమైన సమస్యలను సృష్టిస్తున్నాయని రాయబారి పేర్కొన్నారు.

ఉక్రెయిన్ తో భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయి?

భారత్, ఉక్రెయిన్‌కు మానవతా సహాయం అందిస్తూనే ఉంది. అలాగే, ఈ యుద్ధం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర దేశాలకు కూడా సహాయం చేస్తోందని రాయబారి తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/telugu-news-pakistan-china-big-shock-out-of-the-project/international/541705/

Breaking News in Telugu Google News in Telugu india Latest News in Telugu peace russia ukraine war

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.