📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: War-పాకిస్తాన్ తో యుద్ధం ఆగిపోలేదు.. ఉపేంద్ర ద్వివేది

Author Icon By Pooja
Updated: September 6, 2025 • 2:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

War-పహల్గాం ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్ పాకిస్తాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో అన్నివిధాలుగా భారత్ దే పైచేయి అయ్యింది. అంతేకాదు మనదేశ యుద్ధ సామర్థ్యం ప్రపంచదేశాలకు తెలియవచ్చింది. దీనిపై భారత ఆర్మీ ఛీప్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్ లమధ్య యుద్ధం ముగియలేదని అన్నారు. పహల్గాం దాడి తరువాత భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మే 10తో ముగియలేదని తర్వాత చాలాకాలం పాటూ కొనసాగిందని తెలిపారు. ఇప్పటికీ కూడా ఎల్వోసీ దగ్గర వార్ జరుగుతూనే ఉందని ద్వివేది పేర్కొన్నారు. దీనికి సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయాలన్నీ బయట కూడా చెప్పలేమని అన్నారు.

సరిహద్దులో పోరాటం సాగుతూనే ఉంది

భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో కొనసాగుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ నియంత్రణ రేఖ వెంబడి ఆపరేషన్ సిందూర్ ప్రభావాన్ని అంచనా వేయడం తొందరపాటు చర్యే అవుతుందని ద్వివేది అన్నారు. పాక్ మద్దతు గల ఉగ్రవాదులు ఇంకా రెచ్చి పోతూనే ఉన్నారని సరిహద్దులో చొరబాట్లకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ముగిసి చాలాకాలం కాలేదు కాబట్టి, ఎల్దసి పరిస్థితిపై దాని ప్రభావం గురించి వ్యాఖ్యానించడం అంత సబబు కాదని ద్వివేది పేర్కొన్నారు. ఎంతోమంది ఉగ్రవాదులను ఇప్పటికే భారత ఆర్మీ బట్టుబెట్టిందని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను, జీఎస్టీ మార్పులను జనరల్ ఉపేంద్ర ద్వివేది స్వాగతించారు. ఈ సంస్కరణలు రక్షణ కారిడార్లను బలోపేతం చేస్తాయని, ఈ రంగంలో చిన్న సంస్థల నుండి ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్స హిస్తాయని అన్నారు.

ఆయన పాకిస్తాన్‌పై ఏమి వ్యాఖ్యానించారు?
ఆయన ప్రకారం, పాకిస్తాన్‌తో యుద్ధం పూర్తిగా ఆగిపోలేదని, ఇంకా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో వచ్చాయి?
సరిహద్దు భద్రత, ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చల సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-rashmika-mandanna-rashmikas-concerns-over-early-morning-flights/cinema/542391/

Breaking News in Telugu India Pakistan conflict Indian Army kashmir issue Latest News in Telugu Pakistan Tensions Telugu News Today War News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.