📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: War-గాజాను ఖాళీ చేసి వెళ్లాలంటూ నెతన్యాహు ఆదేశం

Author Icon By Pooja
Updated: September 9, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

War-ఇశ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. తమ బంధీలను విడిచిపెట్టేంత వరకు యుద్ధం ఆపేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) స్పష్టం చేశారు. అంతేకాదు హమాస్ ను అంతం చేసేంత వరకు నిరంతరం దాడుతూ చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. తాజాగా నెతన్యాహు మరోసారి సంచలన ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నివాసితులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లి పోవాలని ఆదేశించింది. హమాస్ వద్ద ఉన్న బందీలను విడుదల చేసి, ఆయుధాలు విడిచిపెట్టాలని వార్నింగ్ ఇచ్చింది. లేకపోతే తమ దాడులు మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించింది. ఇదే చివరి హెచ్చరిక అంటూ వ్యాఖ్యానించింది.

మరోసారి హెచ్చరించిన నెతన్యాహు

2023 దాడుల సమయంలో హమాస్ తీసుకెళ్లిన వారిలో 48మంది ఇంకా వారి చేతిలో బందీలుగా ఉన్నారని, వారిని ఇంకా విడుదల చేయలేదని పేర్కొంది. బందీలను వెంటనే విడిచిపెట్టి, గాజా నివాసితులు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఇజ్రాయెల్ పై సంచలన ఆరోపణలు చేశారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో జరుగుతున్న విధ్వంసం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా నెతన్యాహూ పాలస్తీనా ప్రజలను గాజా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 64వేలమందికి పైగానే మరణించిన గాజా ప్రజలు

అక్టోబరు 2023 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల్లో 64 వేలమందికి పైగా ప్రజలు మరణించారు. ఆహారం కోసం వేచిచూస్తున్న వారిపై ఇజ్రాయెల్ సైన్యం(Israel army) పలుమార్లు దాడులకు పాల్పడింది. దీంతో చిన్నారు, మహిళలు మరణించారు. ఆసుపత్రులపై దాడులకు తెగబడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తనవంతు ప్రయత్నంగా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ హమాస్ మాత్రం ఇజ్రయెల్ 48మంది బందీలను విడిచిపెట్టడం లేదు. రెండు దేశాల యుద్ధం వల్ల సైనికులు కూడా మరణించారు. హమాస్ కూడా ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడింది. ఇశ్రాయెల్ ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఆర్థికంగా కూడా హమాస్, ఇజ్రాయెల్ తీవ్రంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు.

ప్రస్తుతం గాజాలో పరిస్థితి ఎలా ఉంది?
పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతుండటంతో ప్రజలు భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయంపై ఏమి జరుగుతోంది?
గాజా పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-double-railway-line-in-bhadrachalam-dornakallo/telangana/543879/

Breaking News in Telugu Gaza Conflict Gaza People Evacuation Google News in Telugu Israel Gaza war Israel News Latest News in Telugu Netanyahu Gaza Order

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.