📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Visa-ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ షాక్.. లేబర్ వీసాల నిలిపివేత

Author Icon By Pooja
Updated: August 22, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Visa: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి దేశప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు సైతం చుక్కలు చూపిస్తున్నారు. తన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా
విమర్శలు ఎదుర్కొంటున్నా వాటిని పట్టించుకోవడం లేదు. కఠిన టారిఫ్లను విధించి, దేశాల మధ్య ట్రేడ్ వార్కు(Trade war) దిగుతున్నారు. అతడి నిర్ణయాలతో ఇప్పటికే పలు దేశాలు ఖండించాయి. ఇక వీసాల విషయానికి వస్తే పలు కఠినమైన నిబంధనలు పెడుతున్నారు. విద్యార్థులకు, ఉద్యోగులకు ఉన్నపళంగా లేఆఫ్లను ప్రకటించి, వారిని ఇంటికి సాగనంపుతున్నాడు.
విదేశీయులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా, అమెరికాకు విదేశీయుల రాకను అడ్డుకునేందుకు వీసాల మంజూరులో ఎన్నో మార్పులను తీసుకొచ్చారు. తాజాగా వాణిజ్య ట్రక్కులు నడిపే విదేశీ డ్రైవర్లకు ఇకపై వర్క్ వీసాలు జారీ చేయబోమని తాజాగా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు యూఎస్వి దేశాంగశాఖ మంత్రి మర్కో రూబియో ప్రకటించారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూబియో పేర్కొన్నారు. ఇది
తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

ముగ్గురి ప్రాణాలు కోల్పోవడం ఈ నిర్ణయానికి కారణం

ఇటీవల ఫ్లోరిడాలోని హైవేపై ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో రుబియో ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విదేశీ ట్రక్కు డ్రైవర్లపై పలు ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వం అందులో భాగంగా ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలనే నిబంధన చేసింది. రోడ్లపై సూచికలు
చదవకపోవడం, ఇంగ్లిష్ లో మాట్లాడకపోవడం వల్లే అనేక ప్రమాదాలకు విదేశీ డ్రైవర్లు కారణమవుతున్నారని ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ క్రమంలోనే నిబంధనలు కఠినతరం
చేసిన చేసింది అమెరికా

Telugu News: Visa-ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ షాక్.. లేబర్ వీసాల నిలిపివేత

కోట్లాదిమంది వీసాదారులకు పొంచి ఉన్న ముప్పు

కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వలసదారుల(Immigrants) విషయంలో ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న 5.5 కోట్లకుపైగా వీసా హోల్డర్ల పత్రాలను సమగ్రంగా పరిశీలించనుంది. ఎవరైనా వీసా నిబంధనల ఉల్లంఘన చేసినట్టు తేలితే వారి వీసాలను వెంటనే రద్దు చేసి, వారిని స్వదేశానికి పంపించనుంది. అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం, దేశంలో ఉన్న ప్రతి వీసా హోల్డర్పై విచారణ జరిపి, వారు అమెరికాలో ఉండటటానికి అర్హులా కాదా అన్నది పరిశీలించనున్నారు.

ట్రంప్ విధానలతో టెన్షన్లో విదేశీయులు

ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియక అమెరికా ఉంటున్న విదేశీయుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది వీసాలను కోల్పోయి, స్వదేశాలకు వెళ్లిపోయారు. ఉద్యోగులకు లేఆప్(Layoff) ప్రకటించడంతో కూడా చాలామంది పెట్టేబేడా సర్దుకుని స్వదేశానికి వచ్చేశారు. 5.5 కోట్ల వీసా హోల్డర్లలో కొందరు ప్రస్తుతం అమెరికా వెలుపలే ఉన్నట్లు మైగ్రేషన్ పాలసీ ఇన్సిట్యూట్ అసోసియేట్ డైరెక్టర్ జూలియా గెల్లెట్ చెబుతున్నారు. కొత్తగా వచ్చేవారికి కూడా సోషల్ మీడియాలో వారిని పరిశీలించి, వారిపై ఎలాంటి ఆంక్షలు లేవని భావించినప్పుడే వారికి వీసా మంజూరు ఉంటుంది. అక్కడ నివసిస్తున్న విదేశీయులు సైతం వారి సోషల్మీడియాపై నిఘాను ఉంచారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా చాటింగ్ చేసినా, లైక్ లు కొట్టినా అలాంటి వారి వీసాలను తక్షణమే రద్దు చేసి, స్వదేశానికి పంపుతున్న విషయం విధితమే.

విదేశీ డ్రైవర్లపై ఇప్పటి వరకు ఏ నిబంధనలు విధించబడ్డాయి?
విదేశీ డ్రైవర్లు ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడడం రావాలని నిబంధన పెట్టారు. రోడ్డు సూచికలు అర్థం చేసుకోలేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అమెరికా ట్రాన్స్‌పోర్ట్ శాఖ తెలిపింది.

Q4: వీసా హోల్డర్లపై అమెరికా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోనుంది?
ప్రస్తుతం అమెరికాలో ఉన్న 5.5 కోట్ల వీసా హోల్డర్ల రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తోంది. ఎవరైనా వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారి వీసాలను రద్దు చేసి స్వదేశానికి పంపించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/minister-seethakka-telangana-rural-development-funds/telangana/534260/

Breaking News in Telugu Foreign Truck Drivers Ban Foreign Workers in USA Trump Visa Policy US Immigration News Work Visa Ban

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.