అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండవసారి ఎన్నికైన తర్వాత వలసవాదులపై తన ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. ట్రంప్ విదేశీయుల రాకను ఘననీయంగా తగ్గించే చర్యలకు పూనుకుంటున్నారు. దీంతో భారతీయ యువతపై ఈ ప్రభావం అధికంగా ఉంది. ఈ ఏడాది విద్యార్థుల సంఖ భారీసంఖ్య తగ్గింది. హెచ్-1బీ వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం బట్టి అమెరికాలో ఉపాధికి, చదువుకు వెళ్లే అవకాశం లేకుండా అయిపోయింది.
Read Also: Sri Lanka floods : శ్రీలంకలో ఘోర వరదలు, భూస్ర్కలనాలు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం…
అంతేకాక ట్రంప్ అక్రమ వలసదారులను బలవంతంగా వెనక్కి పంపిస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ప్రతిభ గల ఉద్యోగులు కరువవుతున్నారు. దీంతో పలు కంపెనీలు నిపుణులు లేక అల్లాడుతున్నాయి. తాజాగా అమెరికా అత్యంత ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అపారమైన లాభాలు పొందిందని టెస్లా, స్పేస్ ఎక్స్ సిఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) పేర్కొన్నారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన డబ్ల్యూటిఎప్ పాడ్కాస్ట్ లో మస్క్ మాట్లాడుతూ భారతీయ వలసదారులు అమెరికా సాంకేతిక రంగాన్ని ముందకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇటీవల పెరుగుతున్న వలస వ్యతిరేక ప్రభావాలు, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు అనేకమంది భారతీయ యువతకు నిరాశ కలిగించాయని మస్క్ప్రస్తావించారు.
స్వార్థప్రయోజనాల కోసం హెచ్-1బి వీసా దుర్వినియోగం
హెచ్-1బి వీసా (Visa) కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలనే అభిప్రాయాన్ని మస్క్ ఖండించినప్పటికి ఆ కార్యక్రమం కొన్నేళ్లుగా దుర్వినియోగానికి గురైందని అంగీకరించారి. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఈ వ్యవస్థను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని విమర్శించారు. అమెరికా ప్రస్తుతం సరిహద్దులో కఠిన నియంత్రణలు అవసరమయ్యే పరిస్థితిని ఎదుర్కొంటోంది. బైడెన్ ప్రభుత్వంలో సరిహద్దుల నియంత్రణ బలహీనపడటం వల్ల పెద్ద ఎత్తున అక్రమ వలసలు పెరిగాయని, ఇది ఆర్థిక ప్రోత్సాహం రూపంలో తప్పు సంకేతాలను ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏ దేశమైనా తన సరిహద్దులపై నియంత్రణ లేకపోతే, అది దేశంగా నిలవలేదని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారులు ప్రభుత్వ సబ్సిడీలను పొందగలిగే అవకాశం ఉండటంతో, అది మరింత మందిని అక్రమ మార్గాల్లో అమెరికాకు రప్పించే ప్రమాదాన్ని పెంచుతుందని మస్క్ హెచ్చరించారు. కొన్ని వర్గాల్లో వలసదారులు అమెరికాలో అవకాశాలను తీసేస్తున్నారన్న భావన వ్యాప్తి చెందినప్పటికీ, వాస్తవంలో ప్రతిభావంతుల కొరతే నిజమని మస్క్ చెప్పారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: