📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trade War-చైనాతో ట్రేడ్ వార్పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

Author Icon By Pooja
Updated: August 26, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Trade War: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణస్వీకారం చేసిన రోజున నుంచి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. అధిక మొత్తంలో టారిఫ్లను విధిస్తూ, ప్రపంచ దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. ఇక వలసదారులపై కఠినచర్యలు దిగారు. వీసాల్లో అనేక నిబంధనలతో విదేశీయుల రాకను బలవంతంగా అడ్డుకుంటున్నారు. టాప్ యూనివర్శిటీలలో విదేశీ విద్యార్థులకు అవకాశం లేకుండా ఆర్డర్లను జారీ చేస్తున్నారు. తాజాగా చైనాతో వాణిజ్య యుద్ధంపై ట్రంప్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజింగ్తో మంచి సంబంధాలు కోరుకుంటున్నప్పటికీ, వాణిజ్య విధానాల్లో తమదే పైచేయి అని ఆయన స్పష్టం చేశారు. తమతో పోటీ పడాలని చూస్తే చైనాకు వినాశనం తప్పదని పరోక్షంగా, గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, వాణిజ్య పోరడులో చైనా వద్ద కొన్ని కార్డులు ఉంటే, తమవద్ద అంతకంటే అద్భుతమైన కార్డులు ఉన్నాయని అన్నారు. అయితే నేను వాటితో ఆడాలనుకోవడం లేదు. ఒకవేళ నేను ఆ కార్డులతో ఆడితే, చైనా నాశనమవుతుంది. అందుకే ప్రస్తుతానికి ఆ పని చేయను’ అని ట్రంప్ వ్యాఖ్యనించారు.

Trade War-చైనాతో ట్రేడ్ వార్పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

200 శాతం సుంకాలను వెనుకాడం: ట్రంప్

ఈ కొన్ని రకాల అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపివేయడం లాంటి చర్యలకు చైనా పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు తలెత్తితే చైనాపై 200 శాతం వరకు సుంకాలు విధించడానికి కూడా వెనుకాడబోమని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. వాణిజ్యపరంగా తమ ఆధిపత్యాన్ని బీజాంగ్(Beijing) సవాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, ఇరు దేశాల మధ్య సత్సంబంధాల ప్రాముక్యతను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ ఏడాది చివర్లోతానీ, ఆ తర్వాత కొద్దికాలానికి గానీ నేను చైనా పర్యటనకు వెళ్తాను. రెండు దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలు ఉండబోతున్నాయి’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం వాణిజ్యపరంగా విభేదాలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో సంబంధాలు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కయ్యానికి కాలుదువ్వుతున్న ట్రంప్

భారతదేశంపై కూడా ట్రంప్ అధిక టారిఫ్ లను విధిస్తూ, బెదిరింపుచర్యలకు దిగుతున్నారు. దీంతో ట్రంప్ ను ఏమాత్రం ఖాతరు చేయకుండా రష్యా, చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఏకమై, తమ బలాబలాలను పెంచుకునే యత్నంలో ఉన్నాయి.

ట్రంప్ చైనాపై ఏం వ్యాఖ్యానించారు?
చైనాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నానని, కానీ వాణిజ్యపరంగా పోటీ పడితే చైనాకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ట్రంప్ హెచ్చరించారు.

చైనా అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపితే ట్రంప్ ఏం చేస్తారు?
అలా జరిగితే చైనాపై 200 శాతం వరకు సుంకాలు విధించడానికి వెనుకాడబోమని ట్రంప్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-karnataka-women-attack-temple-priest/national/536189/

China vs USA Trade Conflict Donald Trump Harsh Comments Google News in Telugu Latest News in Telugu Telugu News Today Trump 200 Percent Tariffs Trump China trade war US-China Tariff Dispute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.