📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trump-ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక మాంద్యంతో విలవిల

Author Icon By Pooja
Updated: September 9, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Trump-అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. టారిఫ్(Tariff) లను పెంచి, ఇతర దేశాలతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇక వీసాల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, విదేశీయులను గణనీయంగా అదుపు చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక సంచలన వార్తతో వార్తలో నిలుస్తున్నారు. తాజగా ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఆర్థికమాంద్యం తీవ్రస్థాయిలో కొట్టుమిట్టాడుతున్నది. మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జాండి ఇటీవల యుఎస్ రెసిసెన్ (US recession)పై ఒక హెచ్చరిక విడుదల చేశారు. అమెరికా జిడిపలో మూడింట ఒక వంతువాటా కలిగిన రాష్ట్రాలు ఇప్పటికే మాంద్యంలో ఉన్నాయని, లేదా మాంద్యం ‘అధిక ప్రమాదం’కు చేరుకున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మాంద్యం ప్రభావం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మిడ్వెస్ట్, రస్ట్ బెల్ట్ ప్రాంతాలకు చెందిన రాష్ట్రాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి. ఇది పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తోందని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో సంకేతాలు కనిపిస్తున్నాయి..

మార్క్ జాండి ఫైనాన్షియల్ టైమ్తో మాట్లాడుతూ.. అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఆర్థిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్ వంటి పెద్ద రాష్ట్రాలు మాత్రమే కొంచెం స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాలు కలిపి అమెరికా జిడిపిలో మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన భాగంగా నిలుస్తున్నాయి.

వ్యవసాయం, తయారీలలో అధిక మాంద్యం

ప్రత్యేకంగా ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం వ్యవసాయం, తయారీ, నిర్మాణం రంగాల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ రంగాలు ప్రత్యేకంగా గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలలో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ట్రంప్ పరిపాలనలో తాజా సుంకాలు విధించడం.. అలాగే ఇతర దేశాల ప్రతిస్పందన చర్యలు ఈ రంగాలపై మరింత పతనానికి కారణమవుతున్నాయని మార్క్ జాండి పేర్కొన్నారు. వాషింగ్టన్ డిసి ఆర్థిక వ్యవస్థ(Economy) కూడా భారీ కోతల కారణంగా మందగింపును అనుభవిస్తోందన్నారు. అంతేకాక పెట్టుబడిదారులు, వ్యాపారులు, పాలకులు ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మార్క్ జాండి సూచించారు.

అమెరికా ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణం ఏమిటి?
ట్రంప్ తీసుకున్న వాణిజ్య విధానాలు, పన్ను విధానాలు, అంతర్జాతీయ ఆంక్షలే ప్రధాన కారణమని చెబుతున్నారు.

ట్రంప్ నిర్ణయాలు పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపాయి?
పరిశ్రమల పెట్టుబడులు తగ్గడం, నిరుద్యోగం పెరగడం, ఆర్థిక రంగంలో క్షీణత రావడం జరిగింది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-nepal-protesters-set-fire-to-prime-ministers-residence/national/543946/

American Economy Crisis Breaking News in Telugu Global Market Uncertainty Google News in Telugu Latest News in Telugu Trump Decisions Impact Trump Economic Policies US Recession

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.