📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Telugu News: War-అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ కు వార్ గా ట్రంప్ నిర్ణయం

Author Icon By Pooja
Updated: September 5, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వలసవాదులపై కఠిన నిర్ణయాలతో పాటు విదేశీయుల రాకను భారీసంఖ్యలో తగ్గించగల్గారు. వీసా నిబంధనల్లో విప్లవాత్మక మార్పుల్ని చేస్తున్నారు. ఇక సుంకాల విషయంలో విదేశాలతో ట్రేడ్ వార్ కు బీజం వేసారు. పాలనాపరమైన అనేక అంశాల్లో మార్పుల్ని తెస్తూ, కోర్టుల నుంచి కూడా అంక్షింతలు వేయించుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ను ‘డి పార్ట్మెంట్ ఆఫ్ వార్’గా మారుస్తూ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఎగ్జికూటివ్ ఆర్డర్ పై త్వరలోనే ట్రంప్ సంతకం చేయనున్నారు.

పేరు మార్పుపై త్వరలోనే ప్రకటన

1947 కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ పేరును అమెరికా తొలగించింది. డిపార్ట్ ఆఫ్ డిఫెన్స్ గా నామకరణం చేసింది. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఈ పేరును తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలో మాట్లాడారు. ‘రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్(Pete Hegseth) తరచుగా అమెరికా రక్షణశాఖ అని అంటారు. నాకు ఇలా అనడం నచ్చలేదు. అసలు రక్షణ అనే పదం ఎందుకు? గతంలో పిలుచుకున్నట్లుగానే ఇక నుంచి ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అని పిలుద్దాం అనేది సారంశం. రెండో ప్రపంచయుద్ధం అనంతరం 1947 జ జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ సైనిక సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక సైన్యం, వైమానిక దళ విభాగాలను స్థాపించారు. మొత్తానికి 1949లో త్రివిధ దళాలలను ఒకే గొడుకు కిందకి తీసుకొస్తూ జాతీయ సైనిక సంస్థ పేరును రక్షణశాఖగా మార్చారు. అనంతరం ‘యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’గా మార్చారు. ఇప్పుడు ట్రంప్ ఈ పేరును మార్చే యోచనలో ఉన్నారు. త్వరలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏమిటి?
ట్రంప్ అమెరికా రక్షణ శాఖలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయం ఎందుకు ముఖ్యంగా భావిస్తున్నారు?
ఇది అమెరికా సైనిక వ్యూహాలను, అంతర్జాతీయ విధానాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ముఖ్యమని చెబుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nara-lokesh-meets-pm-modi-delhi/andhra-pradesh/541825/

Breaking News in Telugu DefenseDepartment Latest News in Telugu Pentagon Telugu News Today TrumpDecision TrumpNews USPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.