📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trump-రష్యాపై కఠిన చర్యలకు సిద్ధం

Author Icon By Pooja
Updated: September 15, 2025 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యాపై కఠిన ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే నేటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపడం సహా కొన్ని షరతులను పాటించాలని ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ట్రంప్ తన దుందుడుకు చర్యలకు పూనుకుంటున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. ఇక అధిక సుంకాలతో ప్రపంచ దేశాలతో ట్రేడ్ వార్కు దిగుతున్నారు. దీంతో దేశాలమధ్య స్నేహసంబంధాలు దెబ్బతింటున్నాయి. అంతేకాదు విదేశీయులను ఉద్యోగాల్లో చేర్చుకోవద్దంటూ కంపెనీలకు హుకుం జారీచేస్తున్న ట్రంప్ ఇప్పుడు రష్యాపై మరో హెచ్చరిక చేశారు.

మీరు సిద్ధమైతే నేనూ సిద్ధమే

ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఒక పోస్ట్లో ‘రష్యన్ చమురు కొనుగోలు చేయడం షాకింగ్’ అని అభిప్రాయపడ్డారు. ‘మీరు సిద్ధమైతే నేనూ సిద్ధమే. ఎప్పుడు చేయాలో చెప్పండి’ అని నేటో దేశాలకు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. గత బుధవారం డజనుకు పైగా రష్యన్ల డ్రోన్లు పోలాండ్(Poland) గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత నేటో మిత్రదేశాలు, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడి ప్రకటన రావడం విశేషం. ఈ చొరబాటు ఉద్దేశపూర్వకంగా జరిగిందని పోలాండ్ అంటోంది కానీ, రష్యా ఈ సంఘటనను తక్కువ చేస్తూ, పోలాండ్ ను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికలు లేవని ప్రకటించింది.

రష్యాతో ఎలాంటి ఒప్పందాలు వద్దు: జెలన్ స్కీ

రష్యా నుంచి వచ్చే ఎలాంటి ఇంధనాన్నైనా, ఎలాంటి ఒప్పందాలనైనా మనం ఆపాలి. వాళ్లను ఆపాలనుకుంటే, మనకు వాళ్లతో ఎటువంటి ఒప్పందాలు ఉండకూడదు’ అని యూరోపియన్ దేశాలను జెలన్ స్కీ కోరారు. రష్యా చమురు కొనుగోలును 2028 నాటికి నిలిపివేస్తామని ఈయూ తెలిపింది. ఇది త్వరగా జరగాలని, బదులుగా వాషింగ్టన్ నుంచి కొంత చమురు కొనుగోలు చేయాలని అమెరికా కోరుకుంటోంది. ట్రంప్ సందేశం తుర్కియే వంటి దేశాలను కలిగిగి ఉన్న ఈయూకు కాదు, నేటోకి. రష్యన్ చమురును తుర్కియే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. అంతేకాదు, చాలావరకు నేటో సభ్యుల కంటే మాస్కోతో సన్నిహిత సంబంధాలను ఆ దేశమే కలిగి ఉంది. రష్యన్ చమురు కొనుగోఓలును ఆపాలని తుర్కియేని ఒప్పించడం కష్టం కావచ్చు.

ట్రంప్ ఏ అంశంపై హెచ్చరికలు జారీ చేశారు?
రష్యా సైనిక చర్యలు మరియు అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం పెరుగుతున్న నేపథ్యంలో.

ట్రంప్ ఏం ప్రకటించారు?
రష్యాపై కఠిన చర్యలు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/nepal-sushila-announces-new-cabinet-in-nepal/news/politics/547828/

Breaking News in Telugu Donald Trump news International Relations Latest News in Telugu russia Telugu News Today trump US Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.