📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trump- ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థతో పాక్ రహస్య ఒప్పందం

Author Icon By Pooja
Updated: August 21, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థ, పాకిస్తాన్ సైనిక నిధులతో సంబంధం ఉన్న సంస్థల మధ్య కుదిరిన ఓ ఒప్పందం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం ఆర్థిక సహకారం ముసుగులో జరుగుతున్న చీకటి ఒప్పందమని, దీని ద్వారా మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధులు చేరవేసే ప్రమాదం ఉందని ‘డిస్ ఇన్ఫో ల్యాబ్'(Dis Info Lab) విడుదల చేసిన ఒక నివేదిక
సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికా దేశంలో పర్యటించడం, మునీరు అక్కడ నుంచి భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం విధితమే. గతకొన్నిరోజులుగా పాకిస్థాన్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు అనూహ్యంగా మెరుగుపడటం వెనుక ఈ వివాదాస్పద క్రిప్టో ఒప్పందమే కీలకపాత్ర పోషించిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఒప్పందంలో పలువురు వివాదాస్పద వ్యక్తులు పాలుపంచుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Telugu News: Trump- ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థతో పాక్ రహస్య ఒప్పందం

ఒకే సమయంలో రెండు కీలక పదవిలో బిలాల్ బిన్

కాగా ఈ వ్యవహారంలో బిలాల్ బిన్ సాఖిబ్(Bilal bin Saqib) అనే బ్రిటిష్-పాకిస్తానీ వవ్యాపారవేత్త కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిలాల్ బిన్ ఒకే సమయంలో రెండు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. పాకిస్తాన్ కొత్తగా ఏర్పాటు చేసిన ‘పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్’ (పీసీసీ)కి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) కాగా, మరొకటి డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’ అనే క్రిప్టో సంస్థకు సలహాదారుగా పనిచేస్తున్నారు. ఈ సంస్థకు ట్రంప్ కుమూరులు ఎరిక్ట్రం ప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్తో పాటు అల్లుడు జారెడ్ కుష్నర్లకు కలిసి 40శాతం వాటా ఉంది.

పాక్ సైన్యం పాత్రపై పలు అనుమానాలు..

బిలాల్ కు చెందిన పలు కంపెనీలు డొల్ల కంపెనీలని, వాటికి సరైన వెబ్సైట్లు కూడా లేవని నివేదిక తెలిపింది. ఆయన సోదరి మినాహిల్ కు చెందిన ఓ కంపెనీకి పాకిస్తాన్ సైన్యానికి చెందిన రిటైర్డ్ ఉన్నతాధికారులు నడిపే ‘అల్ ముస్తఫా ట్రస్ట్’తో భాగస్వామ్యం ఉందని, ఈ ట్రస్ట్ పాక్ సైన్యానికి చెందిన ఒక ‘స్లష్ఫం డ్’గా పనిచేస్తుందని ఆరోపించింది. ఈ ఒప్పందం తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికాలో పర్యటించడం, ఇరు దేశాల మధ్య కొత్త
ఒప్పందాలు కుదిరాయి. ఈ పరిణామాల తదనంతరమే పాక్ ఏకంగా ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహబంధం వల్ల భారతదేశానికి కొత్త తలనొప్పులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ వివాదాస్పద ఒప్పందం ఏలాంటిదీ?

డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’ మరియు పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ (PCC) మధ్య ఓ ఆర్థిక ఒప్పందం కుదిరినట్లు నివేదికలలో పేర్కొనబడింది. ఇది మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధుల మౌలిక వేదికగా ఉపయోగపడే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు.

ట్రంప్ కుటుంబ సభ్యుల ఈ ఒప్పందంలో భాగస్వామ్యం ఎంత?

ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అలాగే అల్లుడు జారెడ్ కుష్నర్ కలిసి 40% వాటా కలిగి ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-jair-bolsonaro-unfortunately-brazilian-president-tries-to-flee-the-country/international/533703/

Breaking News in Telugu DonaldTrump Google News in Telugu IndiaUSRelations Latest News in Telugu PakistanArmy PakistanCryptoCouncil TrumpFamilyBusiness

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.