📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trump- భారత్ పై ట్రంప్ సలహాదారు నవారో సంచలన ఆరోపణలు

Author Icon By Pooja
Updated: September 6, 2025 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Trump: భారతదేశంపై ట్రంప్ సలహాదారు నవారో మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. భారతదేశం విధిస్తున్న అధిక టారిఫ్ లు(Tariffs) అమెరికాలో ఉద్యోగ నష్టాలకు కారణమవుతున్నాయని తీవ్ర విమర్శలకు దిగారు. భారతదేశం పట్ల ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తోందని వాషింగ్టన్ పోస్ట్ లో ఒక కథనం ప్రచురితం కాగా, దానిపై నవారో స్పందించారు. ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారుగా ఉన్న నవారో భారత్-రష్యా వాణిజ్యంపై తరచుగా విమర్శలు చేస్తున్నారు. గతంలో నవారో ఈ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’ అని అభివర్ణించారు.

భారత్ వల్లే ఉద్యోగాలు పోతున్నాయి..

భారత్ అధిక టారిఫ్ లు విధించడం వల్ల అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయని ఘాటుగా విమర్శించారు. ఇండియా కేవలం లాభాల కోసం మాత్రమే రష్యా చమురును  కొనుగోలు చేస్తోందని, ఆ ఆదాయం రష్యా యుద్ధ రంగానికి చేరుతోంది అని ఆరోపించారు. దీంతో అమెరికా పన్ను చెల్లింపుదారులపై మరింత భారం పడుతోంది. భారత్ నిజం జీర్ణించుకోలేక తప్పుడు వాదనలు చేస్తోంది అని నవారో భారత్ పై విమర్శలు కురిపించారు. నవారో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs of India) తీవ్రంగా ఖండించింది. నవారో చేసిన తప్పుడు, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను తాము చూశామని, వాటిని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నామని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

నిరాశలో ఉన్న ట్రంప్

వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు కెవవిన్ హ్యాసెట్ దీనిపై స్పందిస్తూ రష్యా నుంచి భారత్ ముడిచమురు దిగుమతులు చేసుకోవడం పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన వాణిజ్య బృందం నిరాశలో ఉన్నారన్నారు. అయితే, ఈ విషయంలో అనుకూల పరిణామాలను త్వరలోనే ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ కూడా గతంలో భారత్ టారిఫ్ విధానాలపై తరచుగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికాకు అత్యంత టారిఫ్ లు విధించే భాగస్వామి అని, ఈ వాణిజ్య సంబంధం పూర్తిగా ఏకపక్షంగా సాగుతోందని విమర్శించారు.

మోదీ మంచి మిత్రుడు అన్న ట్రంప్

ఈ వివాదాలు ఒకవైపు కొనసాగుతూనే ఉండగా తాజాగా భారత్ పై ట్రంప్ మళ్లీ మాట మార్చారు. అమెరికాకు భారత్ దూరమైందని, భారత ప్రధాని మోదీతో తాను ఎప్పుడూ స్నేహంగానే ఉంటానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఈ వ్యాఖ్యలపై మోదీ కూడా స్పందించారు. ట్రంప్ వ్యాఖలను తాను అభినందిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇరు దేశాలు బలమైన ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అనేక అంశాలు అమెరికా-ఇండియాను మరింత దగ్గర చేశాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధం కొత్త పుంతలు తొక్కిన నేపథ్యంలో ఒకే ఒక్క అంశంతో ఆ సంబంధం దెబ్బతినేంత బల హీనమైనది కాదని భారత్ భావిస్తోంది.

ట్రంప్ సలహాదారు నవారో భారత్‌పై ఏమి ఆరోపించారు?
నవారో భారత్‌పై సంచలన ఆరోపణలు చేసి, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నవారో ఎవరు?
పీటర్ నవారో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-red-fort-the-red-fort-was-targeted-diamond-urn-stolen/crime/542301/

Breaking News in Telugu Donald Trump Google News in Telugu India News International Relations Latest News in Telugu Peter Navarro Telugu News US Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.