📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Telugu News: Russia-ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

Author Icon By Pooja
Updated: August 29, 2025 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Russia: రష్యా-ఉక్రెయిన్ల(Russia-Ukraine) యుద్ధం మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లోని పలు గ్రామాలు ఇప్పటికే రష్యా తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. రెండు దేశాల మధ్యయుద్ధం ఆగిపోవాలని ప్రపంచదేశాలెన్నో కోరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మానవరహిత వ్యవస్థల వినియోగం పెరగడంతో యుద్ధవ్యూహాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా రష్యా తన నౌకాదళ డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్ కు చెందిన గూఢచర్య నౌక ‘సింఫెరోపోల’ను ముంచేసింది. ఈ నౌకాదళ దాడిలో ఉక్రెయిన్ కు భారీ నష్టం వాటిల్లినట్లు రష్యా రక్షణశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పదేళ్లలో ఉక్రెయిన్ ప్రారంభించిన అతిపెద్ద నౌకగా పేరుగాంచిన సింఫెరోపోల్.. డెనూబ్ నడి డెల్టాలో జరిగిన ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమైంది.

విజయవంతంగా నిర్వహించిన సీడ్రోన్ దాడి

రష్యాకు చెందిన సీ డ్రోన్ ఈ దాడిని విజయవంతంగా నిర్వహించింది. ఈ తరహా డ్రోన్ ను ఉపయోగించి ఒక నౌకను ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి అని నిపుణులుపేర్కొన్నారు  ఈ నౌక రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ గూఢచర్య కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది ఉక్రెయిన్ సైనిక కార్యకలాపాలకు చాలా కీలకమైనది. 2019లో ప్రారంభించి 2021లో ఉక్రెయిన్ నౌకాదళంలో చేర్చిన ఈ నౌక 2014 తర్వాత ఉక్రెయిన్ నిర్మించిన అతిపెద్ద నౌకగా వార్ంజో టెలిగ్రామ్ ఛానెల్ తెలిపింది.ఈ నౌక విధ్వంసం ఉక్రెయిన్ కు వ్యూహాత్మకంగా పెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గల్లంతైన నావికుల కోసం గాలింపు

కాగా ఈ సీ డ్రోన్ దాడిలో ఒక సిబ్బంది మరణించగా పలువురు గాయపడినట్లు ఉక్రేనియన్ అధికారులు ధ్రువీకరించారు. గల్లంతైన నావికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన రష్యా ఇటీవల కాలంలో నౌకాదళ డ్రోన్లు, ఇతర మానవరహిత వ్యవస్థల ఉత్పత్తిని ఎంతవేగంగా పెంచిందో స్పష్టం చేస్తుంది. ఈ డ్రోన్లు యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మరో సంఘటనలో ఉక్రెయిన్లో టర్కిష్ బెరక్తర్ డ్రోన్లను(Turkish Bayraktar drones) ఉత్పత్తి చేసే ఒక సదుపాయంపై రష్యా రెండు క్షిపణులతో దాడి చేసిందని ఉక్రెయిన్ లో టరిష్ బేరక్తర్ డ్రోన్లను ఉత్పత్తి చేసే ఒక సదుపాయంపై రష్యా రెండు క్షిపణులతో దాడి చేసిందని ఉక్రేనియన్ రాజకీయ నాయకుడు ఇగోర్ జింకెవిచ్ పేర్కొన్నారు.

రెండు దేశాల యుద్ధం

మూడున్నర సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఏ దేశం వెనక్కి తగ్గకపోవడంతో ప్రపంచదేశాలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది.చమురు ధరలు పెరగడం, నిత్యావర వస్తువుల కొరత ఏర్పడడం జరుగుతుంది. భారతదేశంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడింది.

సింఫెరోపోల్ నౌక ప్రత్యేకత ఏమిటి?
ఈ నౌక రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ గూఢచర్య కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు 2014 తర్వాత ఉక్రెయిన్ నిర్మించిన అతిపెద్ద నౌకగా గుర్తింపు పొందింది.

ఈ దాడిలో ఎలాంటి నష్టం జరిగింది?
ఒక సిబ్బంది మరణించగా, పలువురు గాయపడ్డారు. గల్లంతైన నావికుల కోసం శోధన చర్యలు కొనసాగుతున్నాయి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/vedapathashala-vedapathashala-to-be-opened-soon-in-kanipakam/andhra-pradesh/537681/

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Russia drone attack Ukraine ship Russia strikes Turkish drone facility Russia Ukraine war latest updates Simferopol warship destroyed Telugu News Today Ukraine war news 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.