📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News: Pakistan-పాక్ కు చైనా బిగ్ షాక్.. ప్రాజెక్ట్ నుంచి అవుట్

Author Icon By Pooja
Updated: September 5, 2025 • 2:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pakistan: అసలే భారత్ తో చేసిన యుద్ధంతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. యుద్ధంతో చతికిపడ్డ పాకిస్తాన్ అందులో నుంచి బయటపడేందుకు ఓ భారీ రైల్వే ప్రాజెక్టు(Railway Project) చేపట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందంతో ప్రాజెక్టు నిర్మాణానికి పనులకు సిద్ధం అయ్యింది. అయితే అన్యూహంగా చైనా యూటర్న్ తీసుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి చైనా తప్పుకుంది. చైనా తప్పుకోవడంతో నిధుల కోసం పాక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను ఆశ్రయించింది. పాక్ లో కరాచీ నుంచి పెషావర్ వరకు ఉన్న మెయిన్ లైన్ 1 రైల్వే ప్రాజెక్ట్ కోసం చైనా భాగమైంది. భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారుగా 9.8 బిలియన్ డాలర్లు. ఈపాజెక్టు నిర్మాణం జరిగితే పాకిస్తాన్ లో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని భావించి చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు చైనా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాక్ సందిగ్ధంలో పడింది.

పాక్ అమెరికాతో స్నేహమేనా

చైనా హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఇందుకు కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకంటే పాకిస్తాన్, చైనా మిత్ర దేశాలు. అయితే ఇటీవల పాకిస్తాన్ అమెరికాతో స్నేహం చేస్తోంది. ఆదేశంతో పలు ఒప్పందాలను కుదుర్చుకుంది పాకిస్తాన్. పాకిస్తాన్ అమెరికాకు దగ్గర కావడంతో ఇది చైనాకు నచ్చలేదు. ఈ కారణం వల్లనే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు పాక్ అప్పులో ఉందని, ఇప్పుడ మళ్లీ సాయం చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి ఈ భారీ పాజెక్టు నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. చైనా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో పాకిస్తాన్ కు మళ్లీ కష్టాలు వచ్చాయి. రుణాల కోసం అన్వేషణ ప్రారంభించింది.

బ్యాంకు ఆశ్రయించిన పాక్

ఈ భారీ రైల్వే ప్రాజెక్టుకు నిధులు సమకూర్చమని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును (Development Bank)ఆశ్రయించింది. 1.72 లక్షల కోట్లు రుణం ఇవ్వాలని ఏడీబీని పాక్ కోరింది. ఈ రైల్వే ప్రాజెక్టు కరాచీ నుంచి పెషావర్ వరకు 1,800 కిలోమీటర్లుకి అప్డేట్ చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు పది సంవత్సరాల పాటు దౌత్యపరమైన చర్చలు జరిపింది. ఏదిఏమైనా చైనా యూటర్న్ తీసుకోవడంతో పాక్ పరిస్థితి మరింతగా దిగజారింది.

చైనా ఏ ప్రాజెక్టుల నుండి వైదొలిగింది?

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) కింద చేపట్టిన కొన్ని ప్రధాన రోడ్డు మరియు విద్యుత్ ప్రాజెక్టుల నుండి చైనా వైదొలగినట్లు సమాచారం. వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకం కావని చైనా భావిస్తోంది.

ఈ నిర్ణయం పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

చైనా ఈ ప్రాజెక్టుల నుండి వైదొలగడం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధుల ప్రవాహాన్ని నిలిపివేస్తుంది, మరియు దేశం యొక్క అప్పుల భారాన్ని మరింత పెంచుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/telugu-news-warning-ajit-pawar-fires-at-ips-officer-video-goes-viral/crime/541606/

china CPEC Economy Google News in Telugu Latest News in Telugu Pakistan project Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.